TRENDING NOW

అద్దంకిపై గొట్టిపాటి పట్టు….మరి కరణం ఎటు?

అద్దంకిపై గొట్టిపాటి పట్టు….మరి కరణం ఎటు?

ఒంగోలు, 3 ఆగష్టు:

ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం… అంటే ఠక్కున గుర్తొచ్చేవి గొట్టిపాటి, కరణం కుటుంబాలు….వారి  మధ్య దశాబ్దాల పాటు నెలకొన్న వైరం…  అయితే ఇంతకాలం ఈ రెండు కుటుంబాల్లో ఒకరు అధికార పార్టీలో ఉంటే మరొకరు ప్రతిపక్ష పార్టీలో ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌పై అద్దంకి నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను టీడీపీ అధిష్టానం పార్టీలో చేర్చుకుంది.

treefurn AD
Life Homepathy

అభివృద్ధిలో దూసుకెళ్తున్న రవి…

దీంతో గొట్టిపాటి, కరణం కుటుంబాలు ఒకే పార్టీలోకి రావడంతో అసలు సమస్య ఇప్పుడు మొదలైంది.  ఒకవైపు అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ గూటికి చేరిన గొట్టిపాటి రవి పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. అలాగే 10 వేల మందికి వృద్దాప్య, వికలాంగ పింఛన్లు మంజూరు చేయించారు. దీంతో రాష్ట్రంలోనే పింఛన్ల మంజూరులో అద్దంకి ప్రథమస్థానంలో నిలిచింది. వెనుకబడ్డ ప్రాంతాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో సిసి రోడ్లు, కాలువలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రత్యేక శ్రధ్ధ చూపించారు. ఇక ఇలా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యని పార్గీలకు అతీతంగా తీర్చడానికి ప్రయత్నిస్తున్న గొట్టిపాటి రవికి అన్ని సామాజిక వర్గాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే గొట్టిపాటి అభివృద్ధిలోనే కాకుండా రాజకీయంగానూ తనదైన వ్యూహాలతో నియోజకవర్గంపై పట్టు నిలబెట్టుకున్నారు.

TDP MLC karanam Balaram sensational comments against ap govt

ఇంకా రవికి వ్యతిరేకంగానే కరణం….

మరోవైపు ఒకసారి మార్టూరు నుంచి రెండుసార్లు అద్దంకి నుంచి తమ కుటుంబాన్ని ఓడించిన రవికుమార్‌ను టీడీపీలోకి తీసుకురావడం కరణం కుటుంబానికి రుచించలేదు. ఆయన పార్టీలో ఉంటూనే ఎమ్మెల్యే రవికుమార్‌కు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను నడిపారు.

చాలాసార్లు ఇరు వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. దాడులూ చేసుకున్నారు. దీంతో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి ఇరువర్గాలని సముదాయించారు. కలిసి పని చేసుకోవాలని సూచించారు. అలాగే గత ఏడాది కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, ఇక నుంచి అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చూసుకుంటారని స్పష్టంగా చెప్పేశారు.

ఇక ఇక్కడే గొట్టిపాటి అసలు రాజకీయం మొదలైంది. అధినేత చెప్పడంతో కరణం బలరాం అద్దంకిలో రాజకీయాలకు దూరంగా జరగడంతో ఎంతో కాలంగా బలరాం వెన్నంటి ఉన్న ప్రధాన నేతలను రవి తనవైపు తిప్పుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పధకాల్లో వీరికి ప్రాధాన్యం కల్పించారు. దీంతో ఇంతకాలం కరణం గ్రూపులో ఉన్న టీడీపీ నేతలు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి జై కొట్టారు. ఈ దెబ్బతో వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరు మీద నడకే అని రవి వర్గీయులు అంటున్నారు.

అయితే ఎన్నికల నాటికి ఈ రెండు గ్రూపులు సఖ్యంగా ఉండేలా చూసుకోవటంలో గొట్టిపాటి వ్యూహం ఫలిస్తుందా అనేది తేలాల్సి ఉంది. కానీ తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి గొట్టిపాటి రవిని ఓడించడానికి కరణం మాస్లర్‌ ప్లాన్‌ వేసి ఆయన తన అనుచరులతో సహా వైసీపీలో చేరి పోటీకి సై అంటే అప్పుడు పరిస్థితి ఏంటనే వాదన కూడా నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి రవికి పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉన్నా, ఎన్నికల సమయానికి ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మామాట: మరి అద్దంకి రాజకీయంలో గెలిచేదెవరో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: