ఫుల్పూర్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న సమాజ్‌వాదీ పార్టీ

Share Icons:

ఢిల్లీ, 14 మార్చి:

ఉత్తర ప్రదేశ్ ఫుల్పూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నాగేంద్ర సింగ్ పటేల్ 59,613 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

ఆయనకు మొత్తం 3,42,796 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థికి 2,83,183 ఓట్లు, కాంగ్రెస్ 19,334 ఓట్లు దక్కాయి.

ఇక బీహార్ లో నితీష్ కుమార్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

జహనాబాద్ అసెంబ్లీ నుంచి ఆర్జేడీ అభ్యర్థి కుమార్ కృష్ణ మోహన్ అలియాస్ సుదయ్ యాదవ్ 35,036 ఓట్ల తేడాతో జేడీయూ అభ్యర్థి అభిరామ్ శర్మపై గెలుపొందారు.

అటు అరారియా లోక్‌సభ నియోజవర్గాన్ని ఆర్జేడీ సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 57,358 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.

అయితే బీహార్ లో బీజేపీకి స్వల్ప ఊరట లభించింది. భబువా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రింకీ రాణి పాండే తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శంభు పటేల్‌పై విజయం సాధించారు.

రింకీ రాణీ పాండే భర్త ఆనంద్ భూషణ్ పాండే మృతితో ఈ నియోజవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. దీంతో కనీసం సెంటిమెంట్ వల్ల అయిన బీజేపీ అక్కడ గెలవగలిగింది.

మామాట: బీజేపీకి సమయం దగ్గరపడినట్లుంది….

English summary:

Samajwadi Party’s Nagendra Singh Patel won by a margin of 59,613 votes in the Uttar Pradesh Lok Sabha constituency. SP Leads in Gorakhpur. In Bihar RJD Wins Jehanabad assembly, BJP Retains Bhabhua.

Leave a Reply