గూగుల్ తో కొంప కొల్లేరే

Share Icons:

 తిరుపతి, ఆగష్టు 14,

వ్యక్తిగత సమాచార గోప్యతపై ప్రపంచమంతా తీవ్రంగా చర్చ జరుగుతున్న వేళ, అసోసియేటెడ్ ప్రెస్ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. యూజర్లు వద్దని చెప్పినప్పటికీ టెక్నాలజీ దిగ్గజం గూగుల్  తన వినియోగదారుల లొకేషన్ వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తోందన్న విషయాన్ని బయటపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో గూగుల్ మ్యాప్స్ ను వాడినప్పుడు మనం ఎక్కడున్నాం? అనే సమాచారం గూగుల్ కు ఆటోమేటిక్ గా చేరిపోతుందనే బాంబు పేల్చింది.

నావిగేషన్ కోసం వాడే గూగుల్ మ్యాప్స్ తో పాటు ఇతర యాప్ ల ద్వారా వినియోగదారుల సమాచారాన్ని ఈ టెక్నాలజీ దిగ్గజం దొంగిలిస్తోందని చెప్పింది. ఇలా దాదాపు 200 కోట్ల మంది డేటాను గూగుల్ రికార్డు చేసింది. ఈ తతంగాన్ని ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన పరిశోధకులు ధ్రువీకరించారు.

లొకేషన్ హిస్టరీ ఆప్షన్ ను నిలిపివేస్తే తాము వివరాలను రికార్డు చేయబోమని గూగుల్ చెప్పినా.. వాస్తవంలో అలా జరగడం లేదని పరిశోధకులు గుర్తించారు. ఇంటర్నెట్ లో ఆహార పదార్థాల కోసం సెర్చ్ చేస్తే.. యూజర్ల లొకేషన్ ను గూగుల్ కేవలం 30 సెంటీమీటర్ల తేడాతో గుర్తించి సేవ్ చేస్తోందని బయటపెట్టారు. అయితే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగానే లొకేషన్ వివరాలను వేర్వేరు యాప్స్ ద్వారా సేకరిస్తూ ఉంటామని గూగుల్ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దేశరక్షణలో ఇది ప్రమాదకర ధోరణిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మామాట: టెక్నాలజీ పదునైన కత్తి అని రుజువుచేస్తోంది గా గూగుల్

Leave a Reply