జబర్దస్త్‌కి గుడ్‌బై చెప్పేసిన రోజా!

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 18,

ఏపీలో ఈ నెల 11న ఎన్నికలు ముగిశాయి. అయితే ఎన్నికలకంటే ముందే  ఈ సారి సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని చెప్పాయి. అయితే అనుకున్నట్టుగానే జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయన మంత్రివర్గం ఎలా ఉండబోతుంది అని ముందుగానే చర్చలు జరుపుతున్నారు రాజకీయ విశ్లేషకులు.   అయితే  నగరిలో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందిన ఫైర్ బ్రాండ్ రోజాకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని అనుకుంటున్నారు వైసీపీ నాయకులంతా.

అయితే ఒకవేల మంత్రివర్గంలో చోటు లభిస్తే హోంశాఖ కేటాయిస్తారని ఒకరు, స్త్రీ శిశుసంక్షేమశాఖ అంటూ మరోకరు కాదు కాదు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అంటూ ఇంకొకరు ఇలా రకరకాల పదవులను కేటాయిస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే బుల్లితెరపై మంచి పాపులర్ షో గా తక్కువ కాలంలోనే మంచి పేరుపొందినది జబర్దస్త్. ఆ షో నటీనటులకు ఎంత పేరుతెచ్చిపెట్టిందో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాకు అంతే పేరు తెచ్చిపెట్టింది.

వైఎస్ జగన్ సీఎం అయితే జగన్ కేబినేట్ లో రోజా ఉండబోతున్నారని ఆమె కీలక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించింది. అయితే రోజా అధికార పార్టీపై విమర్శలు చేసేటప్పుడు ఎమ్మెల్యేగా పనికిరారు జబర్దస్త్ షోలు చేసుకో అంటూ పలువురు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయినా రోజా మాత్రం వాటిని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు.

వైసీపీ గెలిచాక మంత్రిగా బాధ్యతలు చేపడితే ఆమె షోకి వెళ్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫలితంగా ఆమెపైనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె జడ్జిగా కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. అంతేకాదు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మరో వృత్తికి అనర్హులు అని నిబంధన ఉండటంతో ఆమె జబర్దస్త్ కు వీడ్కోలు పలకనున్నారని ప్రచారం హోరెత్తిస్తోంది. ఇంకా ఎన్నికల ఫలితాలే రాలేదు ఇల రోజాపై రోజుకు ఒక ప్రచారలు జరుగుతూనే ఉన్నాయి. అసలు నగరిలో రోజా గెలుస్తుందో లేదో అది తెలియాలి ముందు. ఒక వేళ రోజా గెలిచిన వైసీపీ గెలవాలి కదా. వీటన్నిటికి తెర పడాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.

 

మామాట: మంత్రిగారికి తీరిక ఉండొద్దూ..

Leave a Reply