దిగిన బంగారం

Share Icons:

కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 08,

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, స్థానికంగా డిమాండ్‌ లేకపోవడం వంటి వాటితో దేశీయ మార్కెట్లో పసిడి ధర వరుసగా రెండో రోజు పడిపోయింది. శనివారం మార్కెట్లో రూ. 100 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 31,350 పలికింది. కాగా.. వెండి మాత్రం నేడు కాస్త పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో నేటి మార్కెట్లో రూ.275 పెరిగి కేజీ వెండి ధర రూ. 37,775పలికింది.

అమెరికా ఉద్యోగ డేటా సానుకూలంగా ఉండటంతో డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో పసిడిలో పెట్టుబడులు తగ్గాయి. దీనికి తోడు స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కూడా కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గినట్లు బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ పసిడి 0.28శాతం తగ్గి ఔన్సు ధర 1,196.20 డాలర్లు పలికింది.

మామాట: ఎప్పుడు పెరగాలో కాదు, తగ్గడం కూడా తెలుసా బంగారం

Leave a Reply