నెటిజన్‌పై విరుచుకపడ్డ టీనాదత్తా?!

Share Icons:

అనునిత్యం ఫొటోషూట్‌లతో నెటిజన్లను, అభిమానులను అలరించే టీవీ నటి టీనా దత్తా ఇటీవల షేర్‌ చేసిన ఫొటో ఒకటి తీవ్ర విమర్శల పాలైంది. ఆ ఫొటోలో టీనా టాప్‌లెస్‌గా దర్శనమివ్వడంతో అభిమానులు అవాక్కయ్యారు. ఇది మరీమరీ శృతి మించినట్లుందని కొందరు బాహాటంగా విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఓ నెటిజన్‌ మరీ దారుణంగా నటిని కించపరుస్తూ కామెంట్లు చేశాడు. ఇది చూసిన టీనా దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది.

‘పితా మాతా సంతాన్‌’ అనే బెంగాలీ సినిమాలో బాలనటిగా కనిపించిన టీనా ‘ఉత్తరన్‌’ సీరియల్‌లో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల మనసు దోచింది. గతేడాది వచ్చిన ‘నక్సల్‌బరి’ వెబ్‌సిరీస్‌లోను అభినయానికి ఆస్కారమున్న పాత్రలో నటించింది. 
సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply