వైసీపీని వీడనున్న ఆదిశేషగిరి రావు…

Share Icons:

హైదరాబాద్, 8 జనవరి:

వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వైసీపీని వీడనున్నారని తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈరోజో, రేపో పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా చేయనున్నారు.

కాగా, 2019 ఎన్నిక‌ల్లో ఆది శేష‌గిరిరావుకు ఎంపీగా అవ‌కాశం ఇస్తార‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అందుకు ఒప్పుకున్న ఆదిశేష‌గిరి రావు త‌నకు గుంటూరు నుండి పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే, పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం విజ‌య‌వాడ నుండి పోటీ చేయాల‌ని ఆదిశేష‌గిరి రావుకు సూచిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

దీంతో మ‌న స్థాపానికి గురైన ఆయ‌న వైసిపిని వీడాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఉన్న బంధుత్వం వలన ఆయన టీడీపీ గూటికి చేరే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆదిశేష‌గిరి రావు పార్టీని వీడతారన్న వార్తల నేపథ్యంలో వైసిపి పెద్దలు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మామాట: ఎన్నికల వేళ ఇలాంటి మార్పులు సహజమే..

Leave a Reply