జార్జ్ రెడ్డి రివ్యూ: విప్లవ విద్యార్ధి…

george reddy telugu movie review
Share Icons:

హైదరాబాద్: జార్జ్ రెడ్డి…సరిగ్గా 45 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ విప్లవ విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం. సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో జీవన్ రెడ్డి దర్శకుడుగా రూపొందిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేర ఆకట్టుకుంది. కేరళ నుంచి వచ్చిన జార్జ్ రెడ్డి విప్లవ నాయకుడుగా మారిన సన్నివేశాలు తెరపై ఎలా ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే కేరళలో పుట్టి పెరిగిన జార్జ్ రెడ్డి (సందీప్ మాధవ్)ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు. ఇక ఆయన వచ్చేసరికి యూనివర్సిటీలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ అగ్రకులాల ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. అది చూసి జార్జ్ రెడ్డి అసలు తట్టుకోలేకపోతాడు. వారిపై ఎలా తిరుగుబాటు చేశాడు. స్టూడెంట్స్ పాలిటిక్స్ లో తిరుగులేని నాయకుడుగా ఎలా ఎదిగాడు. అదే సమయంలో ఆయన శత్రువులు ఎలా చంపేశారనేదే సినిమా కథ.

మామూలుగా జార్జ్ రెడ్డి అనే వ్యక్తి 45 ఏళ్ల కిందటి వారికి తెలుసుగానీ, ఈతరం వారికి తెలియదు. కానీ ఈతరం వారికి సందీప్ ని చూస్తే జార్జ్ రెడ్డి లాగానే కనిపించాడు. జార్జ్ పాత్రకు ప్రాణం పోశాడు. సత్యదేవ్, చైతన్యకృష్ణ, మనోజ్, నందం చిన్న చిన్న పాత్రల్లో పర్వాలేదనిపించారు. ఇక దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడంలో దర్శకుడు జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకోసం తీసుకున్న జాగ్రత్తలు, ముఖ్యంగా అప్పటి నేపథ్యం దగ్గరనుంచీ.. ఆయా పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం, అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించడం బాగున్నాయి. అలాగే సురేష్ బొబ్బిలి అందించిన పాటలు, అర్జిత్ దత్త అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సుధాకర్ యెక్కంటి సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అయితే సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ కొన్ని సన్నివేశాలని సాగదీయడం. అలాగే కొన్ని సీన్లు ఆసక్తికరంగా సాగవు. ఇక కొన్ని సీన్లు అద్భుతంగా సెంటిమెంట్ పండితే దాన్ని కొన్ని సీన్లు డల్ గా ఉన్నాయి. పైగా కొన్ని సీన్స్ కోసం సినిమా లెంగ్త్ ని కూడా పెంచడం మైనస్. కాకపోతే మొత్తం మీద అయితే ఒక విప్లవ విద్యార్ధి నాయకుడు జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగా జార్జ్ రెడ్డి లాంటి రియల్ హీరో గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

Leave a Reply