వైవిద్య శృంగారంపై మోజు

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 07

 

భారత ప్రజాస్వామ్యంలో వెర్రి వేయివేల తలలతో విలసిల్లుతోంది. ఇపుడు ఇక్కడ అంతా స్వేచ్ఛాగానం పాడుకుంటు న్నారు. ముసుగులు తొలగిపోయి, నగ్నంగా నర్తించడం స్వేచ్ఛగా భ్రమిస్తున్నారు. అదుపుతప్పిన వేగంతో ప్రమాదాలు జరుగుతాయి, అది రోడ్డుపైన అయినా, జీవన విధానంలో అయినా, ఈ సూక్ష్మమైన ప్రకృతి సూత్రాన్ని నేడు సర్వోన్నత న్యాయ నిపుణులు మరచిపోయినట్టున్నారు. ప్రకృతికి విరుద్దమైన విధానాలకు చట్టబద్దత కల్పిస్తు న్నారు. ఇది వైపర్యీత్యం కాకమానదు. మానని గాయాలను రేపుతున్న మేధావులు భావి తరాలు ఎదుర్కోబోయే జఠిలతలను అంచనావేయడంలో పూర్తిగా విఫలమైనారు. వ్యక్తుల అంగీకారం సరిపోతే… వ్యభిచారం కూడా నేరం కాదా, బహు భార్యత్వం, బహు భర్తృత్వం నేరాలు కావు కదా ఇద్దరూ ఇష్టపడితే చాలా..

సెక్షన్-377 ఏం చెబుతోంది..

ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొన్నారు.  దీని ప్రకారం పురుషులు-పురుషులు, మహిళలు-మహిళలు లేదా మనుషులు-పశువులతో శారీరిక సంబంధాలు ఏర్పరచుకుంటే అది నేరం.  ఆ నేరానికి వారికి పదేళ్ల శిక్ష లేదా జీవిత ఖైదు, జరిమానా  విధిస్తారు. ఈ నేరానికి బెయిల్ లభించదు.

గురువారం, (06.09.18) న భారత సుప్రీంకోర్టు చారిత్రిక తీర్పు వెలువరించింది. లింగ సంపర్కం నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్-377పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు –

  • వ్యక్తుల లైంగిక స్వభావం అంతర్గతమైనది. అతను లేదా ఆమె ఎవరి పట్ల ఆకర్షితులవుతారన్న దానిపై వారి నియంత్రణ ఉండదు. దానిని అణచివేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే.
  • శరీర లక్షణాలు అన్నవి వ్యక్తిగతమైనవి. అవి వారి ఇష్టపూర్వకం. అవి వాళ్ళ ఆత్మగౌరవంలోభాగం. సెక్షన్ 377 అన్నది ఆర్టికల్ 14 ఉల్లంఘనే.
  • జీవించే హక్కు అనేది జీవితంలో కీలకం.
  • పరస్పర అంగీకార, అంగీకారం లేని చర్యల విషయంలో తేడాను చూడడంలో సెక్షన్ 377 విఫలం.
  • ఎల్‌జీబీటీలను క్రిమినల్ బాధ్యులుగా చేయడం ద్వారా, వారిని వేధించడానికి సెక్షన్ 377 ఒక ఆయుధంగా మారింది.
  • సెక్షన్ 377 అహేతుకమైనది. మిగిలిన పౌరులకు లాగానే ఎల్జీబీటీ కమ్యూనిటీకీ లైంగిక హక్కులున్నాయి.

 ఇకపై ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానిని నేరంగా పరిగణించరు. ఎవరి అనుమతైనా లేకుండా లైంగిక చర్యల్లో పాల్గొనడం మాత్రం నేరపూరితమే. ఈ విషయంలో పిల్లలకు పోస్కో చట్టం కింద రక్షణ లభిస్తుంది. అయితే ఎవరైనా పశువులతో లైంగిక చర్యల్లో పాల్గొంటే మాత్రం దానిని నేరంగా పరిగణిస్తారు.

స్వలింగ సంపర్కం వ్యాధా?

ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐపీఎస్) తాము విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో “ఇప్పుడు స్వలింగ సంపర్కం వ్యాధి అనుకోవడం సరికాదు అంది”. స్వలింగ సంపర్కుల గురించి భయపడాల్సిన అవసరం లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. సమాజం వారిని కూడా అంగీరించాలని అంటున్నారని పేర్కొన్నారు.  ఇంకా, “గత 50 ఏళ్లలో స్వలింగ సంపర్కం ఒక వ్యాధి అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లభించలేదు” అని సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ భిడే చెప్పారు.

 ఏం చేయదలుచుకున్నారు. సమాజం ఎటు పోతోంది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఈ కొత్త పరిణామాలను మీరూ ఆహ్వానిస్తున్నారా.. వీటి వైపరీత్యాలు మీకు అవగతమౌతున్నాయా.. తాత్కాలిక ఉపశమ నాలతో సరిపుచ్చదలుచు కున్నారా…  వినిపిస్తోందా.

మామాట:  సమాజం ఎటువెడుతోందో తెలుస్తోందా

Leave a Reply