క్రికెటర్ల కంటే వారే గొప్ప అంటున్న గౌతమ్ గంభీర్

Share Icons:

ఢిల్లీ, 5 సెప్టెంబర్:

గౌతమ్ గంభీర్..క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు…తనదైన శైలిలో ఆడుతూ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించిన ఆటగాడు…అలాగే మొదటి టీ-20 ప్రపంచ కప్. 2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే గత కొంతకాలంగా ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.

ఇక ఆ తర్వాత అడపాదడపా రంజీ మ్యాచ్‌లు ఆడుతూ.. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రస్తుత భారత్ జట్టుపై తనదైన శైలిలో విమర్శలు, ప్రశంసలు కురిపిస్తాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా 1-3తో సిరీస్ ను కూడా కోల్పోయింది. అయితే, ఇదే సమయంలో ఏషియాడ్‌లో భారత్ పతకాలతో హోరెత్తిస్తున్నా క్రీడాకారులకు సరైన గుర్తింపు లభించకపోగా మీడియా ఫోకస్ మొత్తం భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌పైనే సారించింది.

తాజాగా ఈ విషయమై గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ఏషియాడ్ అథ్లెట్లే నిజమైన హీరోలని కొనియాడాడు. అడ్డంకులను అధిగమించి విజయాలు సాధించారని, క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలని తేల్చి చెప్పాడు. ఏషియాడ్‌లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. 15 బంగారు పతకాలు, 24 రజత, 30 కాంస్య పతకాలతో మొత్తం 69 పతకాలు సాధించారు. గతంతో పోలిస్తే భారత్‌కు ఇదే అత్యుత్తమం.

మామాట: నిజమే…క్రికెటర్లకి తప్ప వేరే క్రీడాకారులకి సరైన గుర్తింపు దక్కడంలేదు..

Leave a Reply