గంటా భలే ట్విస్ట్ ఇచ్చారుగా….వైసీపీలోకి వెళ్ళనట్లేనా?

Share Icons:

విశాఖపట్నం: ఏ పార్టీలో ఉన్న విజయం సాధిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గత కొద్దిరోజులుగా అధికార వైసీపీలో చేరిపోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ పెట్టిన రూల్ కి ఓకే చెబుతూ…ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే గంటా రాకని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారడం ఆలస్యమవుతుంది. ఈ క్రమంలోనే గంట ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

రేపు చంద్రబాబు విశాఖ పర్యటన ఉన్న నేపథ్యంలో నేడు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. అయితే ఇన్ని రోజులు టీడీపీకి దూరంగా ఉన్న గంటా హఠాత్తుగా పార్టీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు కొద్ది రోజులుగా ఆయన టీడీపీ కార్యాలయం మెట్లు ఎక్కడం లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో..ఆయన టీడీపీలోనే కొనసాగుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఆయన వ్యతిరేక శిబిరం మాత్రం టీడీపీలో గంటా ఎక్కవ కాలం కొనసాగరని..ఆయన వైసీపీలో చేరటానికి మంత్రాంగం నడుపుతున్నారని చెప్పుకుంటున్నారు.

టీడీపీలో ఇస్టం లేక కొనసాగుతున్నారనే ప్రచారం ఎదుర్కొంటున్న గంటా పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యాలయం మెట్టు ఎక్కటం లేదు. అదే విధంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. పైగా గంటా అసెంబ్లీలో పీఏసీ ఛైర్మన్ పదవి కోసం ప్రయత్నించారు. అయితే, చంద్రబాబు అది గంటాకు కాదని..పయ్యావుల కేశవ్ కు అప్పగించారు. దీంతో ఆయన మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరిగింది. ఇక, గంటా అటు టీడీపీ వీడుతారనే సమాచారంతోనే చంద్రబాబు పదవి ఇవ్వలేదని చెబుతున్నారు.

గంటా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలోకి రావటానికి మంతనాలు సాగాయని సమాచారం. ఎన్నికల ముందే గంటా వైసీపీలోకి వస్తారని అప్పట్లో విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, స్థానిక మంత్రి అవంతితో పాటుగా.. గంటా కారణంగా గతంలో ఇబ్బంది పడిన వైసీపీ నేతలతో సర్దుబాటు చేసుకుంటే పార్టీలోకి రావటానికి ఇబ్బంది లేదని వైసీపీ నేతలు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు గంటా సునుఖంగా లేరని దానికంటే టీడీపీలో కొనసాగడమే బెటర్ అనుకుంటున్నారని సమాచారం. అందుకే ఆయన పార్టీ సమావేశానికి హరాజరయ్యారు.

 

Leave a Reply