గన్నవరం ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడేదెప్పుడో?

tdp mla vallabhaneni vamsi ready to leave tdp and joins ysrcp
Share Icons:

విజయవాడ: గత కొన్ని రోజులు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారిన విషయం ఏదైనా ఉందటే అది..వల్లభనేని వంశీదే. రెండో సారి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ప్రతిపక్షానికి పరిమితమైన విషయం తెలిసిందే. అయితే అధికారం లేకపోయేసరికి వంశీకి ఇబ్బందులు తప్పలేదు. ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉండటం మానేశారు. ఏదో నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మీద ఓ కేసు వచ్చి పడింది. దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఆయన వెంటనే మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి సీఎం జగన్ని కలిశారు.

ఇక అక్కడ నుంచి ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇటు వెంటనే వంశీ టీడీపీకి ,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు వాట్సాప్ లో పంపారు. అలాగే బాబు కూడా కేశినేని నాని, కొనకళ్ళ నారాయణలని పంపి వంశీని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయిన వంశీ వెనక్కి తగ్గలేదు. అయితే దీని తర్వాత వంశీ రాజకీయానికి విశ్రాంతి కార్డు పడింది. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో చేరకుండా అలా ఉన్నారు. దీంతో కార్యకర్తలు ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వంశీ ఏ పార్టీలో చేరాతరో అర్ధం కాకుండా ఉంది.

అటు గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు విషయానికి వస్తే, వంశీ సీఎంను కలిసిన తరువాత రెండు, మూడు రోజులు కార్యకర్తలతో హడావుడి చేసి, ఇప్పుడు సైలెంటయ్యారు. వంశీ వైసిపిలోకి వస్తే ఐదేళ్ళుగా వైసిపినే నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోతారని, వంశీ బాధితుల పేరుతో ప్రెస్‌మీట్లు కూడా పెట్టించారు. ఒకవేళ వంశీ వైసిపిలోకి వస్తే, సీఎంను కలిసిన తరువాత తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి, ఇంతవరకు సీఎంను కలవలేదు యార్లగడ్డ. దీనిని బట్టి చూస్తుంటే, గన్నవరం పంచాయతీపై, రెండు వారాలుగా కార్యకర్తల హడావుడి తప్ప నాయకుల మధ్య హడావుడేమీ కనిపించడం లేదు. వంశీ, యార్లగడ్డలు ఎవరి లాబీయింగ్ వారు చేసుకుంటున్నా, వీరిద్దరి వలన కార్యకర్తలు చాలా ఇబ్దంది పడుతున్నారు.

ఇటు టిడిపి కార్యకర్తల విషయానికి వస్తే, ఈ నాలుగైదు నెలలు నానా యాతన పడ్డామంటున్నారు. అధికారం ఉన్నప్పుడు వైసిపి వారిపై తమ జులుం ప్రదర్శించి, ఇప్పడు అధికారం కోల్పోయేసరికి తట్టుకోలేక వైసిపికి జంప్ చేయాలనే తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి రెండు వారాలుగా నలుగుతున్న గన్నవరం పంచాయతీ, ఎప్పటికి తేలుతుందో తెలియక అటు టిడిపి కార్యకర్తలు, ఇటు వైసీపీ శ్రేణులు, తికమకైపోతున్నారట. అసలు వంశీ వైసీపీలోకి ఎప్పుడు వెళ్లాతారో? లేక బీజేపీలోకి వెళతారా లేదా టీడీపీలోనే ఉంటారా అనేది తేలడం లేదు. చూడాలి మరి… వంశీ క్లైమాక్స్‌లో ఏ పార్టీ తరపున శుభం కార్డు వేస్తారో చూడాలి.

Leave a Reply