Header Banner
Header Banner
TRENDING NOW

గాంధీజీ ఆహారం-అలవాట్లు

గాంధీజీ ఆహారం-అలవాట్లు

తిరుపతి, అక్టోబర్ 03,

ఇది మహాత్ముని 150వ సంవత్సరం. అందులో భాగంగా ఈ వ్యాసం… మీ కోసం… గాంధీ గురించి తెలుసుకుందాం రండి..

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

మహాత్ముడు మన నేలలో జన్మించి 150 సంవత్సరాలు వచ్చేశాయి. ఆయన లాంటి వారు ఈ నేలపై తిరిగాడినట్టు భావితరాలు నమ్మవు అనేంతగా గాంధీ జీవితం వైవిధ్య భరితంగా ఉండేది. ఆయనలోని నిజాయితీ, నిరాడంబరత జన సమూహాలను కదిలించేది. స్వతంత్ర్యసమరంలో భాగంగా ఆయన 17 మార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. అందులో ఒక సారి ఏకంగా 21 రోజుల పాటు ఆహారం లేకుండా ఉండగలిగారు. తనపోరాటంలో నిరాహారదీక్షను భాగంగా, ఆయుధంగా మలచుకున్నారు గాంధీ. నిజానికి నిరాహారమనేది ఆయన జీవన సిద్దాంతంలో ప్రధాన భాగంగా మారింది.

గాంధీ ఆహారపు అలవాట్లు ఆయనకున్న ఉత్తమ హాబీలలో కొన్ని. అవి ఆయనకు ఎంతో ప్రాముఖ్యం కలిగినవిగా భావించే వారు.  మహాత్ముని ఆహారంతో ప్రయోగాల గురించి స్థూలంగా తెలుసుకుందాం…

గాంధీ కుటుంబం శాకాహార కుటుంబం. అందువలన ఆయన బాల్యంలో మాసం, గుడ్లు వంటివి తినే అవకాశం ఉండేది కాదు. అయితే బాల్యచాపల్యంతో ఒకటి రెండు మార్లు గాంధీ మాంసాహారం రుచి చూసినప్పటికీ,  ఆ తరువాత పశ్చాతాపంతో దహించుకుపోయేవారు. అందువలన తరువాత వాటిని విడిచిపెట్టారు.  కుటుంబనేపథ్యం కారణంగా లా చదువుకోవడానికి లండన్ వెళ్లే వరకూ గాంధీ శాకాహారిగానే ఉండేవారు. గాంధీ బిఫోర్ ఇండియా అనే పుస్తకంలో చరిత్రకారుడు రామచంద్రగుహ దీనిపై వివరంగా రాస్తారు. విధి లేక శాకాహారం తినడం కాదు-లండన్ లో స్వయంగా గాంధీ శాకాహారాన్ని ఎంపిక చేసుకున్నారంటారు. తన రూమ్మేట్ సహాయంతో లండన్ వెజిటేరియన్ సొసైటీ ఉందనే వాస్తవం కూడా గాంధీజీ తెలుసుకుంటారు. అక్కడై తెల్ల సైనికులు మద్యం-మాసం లేకుంటే ఎంత గింజుకుంటారో, భారతీయ సైనికులు కేవలం బియ్యం-పప్పులు తిని కూడా ఎలా చివరివరకూ పోరాడుతారో కథలు కథలుగా గాంధీకి తెలుస్తుంది. చివరకు గాంధీ, ఆయన మిత్రుడు వారి నెం.52, సెయింట్ స్టీఫెన్స్ గార్డన్, బేస్ వాటర్ హోమ్, లో మిత్రులకు పప్పుల చారు, అన్నం, ఎండుద్రాక్షలతో విందుచేసేవారు. ఇక గాంధీ డైట్ అండ్ డైట్ రిఫార్మ్స్, ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజమ్, కీ టు హెల్త్  అనే పుస్తకాలు కూడా రచించారు.

చివరి దశకాల్లో గాంధీ చాలా ఆహారపు అలవాట్లను విడిచిపెట్టారు. మసాలా దినుసులు మానివేశారు. ఉడికించిన కాయగూరలు మాత్రమే తినేవారు. పాల కోసం పశువులను హింసించడం చూసి, ఆవు, బర్రె పాలను తాగడం మానివేశారు. అవసరమైతే మేక పాలు తాగేవారు.  సబర్మతి ఆశ్రమంలో గాంధీ ఉన్నసమయంలో కఠినమైన ఆహారనియమాలు అమలులో ఉండేవి. గాంధీ రెండో కుమారుడు మణిలాల్ సతీమణి సుశీల ఆవిషయాలను మణిలాల్ ఆత్మకథ రాసిన తన మనవరాలితో పంచుకున్నారు. సబర్మతిలో అప్పుడు ఆహారం అంటే ఉడికించిన వంకాయ, బీట్రూట్,  మరి కొన్ని కూరగాయలు, వెన్న లేని రొట్టె.. నెయ్యి కూడా ఉండదు. దాన్ని మందులాగా కష్టపడి తినేదాన్ని అని చెప్పుకొచ్చారు.

సుశీల రెండో కుమార్తె ఎలా  ఐదు సంవత్సరాల వయసులోనే ఒకసారి గాంధీతో తాతయ్యా, సేవాగ్రామానికి పేరు మార్చండి, దీనిని గుమ్మడిగ్రామం అని పిలవండి అని పరిహాసం చేసిందట. వరుసగా మూడోరోజూ గుమ్మడి కూర తినలేక. అయితే సేవాగ్రామంలో అందరికీ వంటశాల ఉమ్మడిగానే ఉన్నా, కస్తూరిబా గాంధీకి మాత్రం విడిగా ఓ వంటశాల ఉండేదట, అందులో ఆమె తన మనవలు, మనవరాళ్లకోసం మిఠాయిలు తయారుచేసేవారు. 1942లో గాంధీ ఆశ్రమం నిర్వాహకునికి లేఖ రాస్తూ కస్తూరిబా ఉన్నంత వరకూ ఫరవాలేదు,  ఆ తరువాత ఆశ్రమం కోసం పంచదార  తీసుకురావద్దని రాశారు. 

అంతే కాదు తనతో ఎంతో విభేదించిన నేతాజీ ఆరోగ్యంపై కూడా గాంధీ శ్రద్ధచూపేవారు. ఆయనకోసం 1936లో విడిగా డైట్ చార్ట్ రూపొందించినట్టు గాంధీ ఎన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీలో ప్రమోద్ కపూర్ అందించిన ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. అందులో పచ్చిఉల్లి, వెల్లుల్లిని పశ్చిమ దేశాలలో తింటారని, తాను కూడా రక్తపోటు నియంత్రణకోసం పచ్చి వెల్లుల్లి తీసుకుంటా నని తెలిపారు. వెల్లుల్లి మంచి విషనిరోధిగా పనిచేస్తుందని, క్షయరోగులకు కూడా మంచి మందుగా పనిచేస్తుందన్నారు. ఇంకా రాస్తూ, వైష్ణవ విధానంలో ఈ రెండు ప్రమాదరహిత కాయగూరలను కేవలం వాటి వాసన కారణంగా తినడం మానేస్తున్నారు అంటారు గాంధీ. ఆయుర్వేదంలో వీటికి ఎంతో ప్రధాన్యత ఉందని, వెల్లుల్లిని పేదవారి కస్తూరి అని పిలుస్తారని గాంధీ పొర్కొన్నారు. ఉల్లి, వెల్లుల్లి లేకపోతే గ్రామీణులు ఇంకేం తింటారనికూడా ప్రశ్నిస్తారు.

అవసరమైనంత వరకు తినడం అనే ప్రాధమిక సూత్రాన్ని ఆహారం విషంలో గాంధీ అనుసరించిన విధానం. ఆయన రుచులను కోరుకోలేదు. ఆహారవినియోగంలో పొదుపు పాటించేవారు. గాంధీ జీవితం లాగానే ఆయన భోజనం కూడా ఉండేది. మనం ఏం తింటామో అలాగే ఉంటాం (య ఆర్ వాట్ యు ఏట్) అన్న నానుడికి ప్రతిరూపం గాంధీ.

మామాట: నోటిని అదుపుచేసుకుంటే రోగాలు అదుపులో ఉంటాయంటారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: