గెలాక్సీ ఎం30 ఏప్రిల్ 11న ఫ్లాష్ సేల్

Galaxy M30 Flash sale on April 11th
Share Icons:

ముంబై, ఏప్రిల్ 09,

సాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం30 ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 11న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో జరగనుంది. అమెజాన్‌తో పాటు సాంసంగ్ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ కొనొచ్చు. ఫిబ్రవరి 27న లాంఛ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్‌కు బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి క్రేజ్ ఉంది.

సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ మోడల్‌తో షావోమీ, రియల్‌మీ, ఏసుస్ లాంటి బ్రాండ్లకు పోటీ ఇస్తోంది సాంసంగ్. అందుకే ఫ్లాష్ సేల్స్‌లో ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.3110 విలువైన ప్రయోజనాలు ఉన్నాయి. రూ.198, రూ.299 రీఛార్జ్ చేసుకున్నవారికే ఈ ప్రయోజనాలు లభిస్తాయి.

సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 4జీబీ, 6జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్

రియర్ కెమెరా: 13+5+5 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

కలర్స్: గ్రేడియేషన్ బ్లాక్, గ్రేడియేషన్ బ్లూ

ధర: 4జీబీ+64జీబీ- రూ.14,990,            6జీబీ+128జీబీ- రూ.17,990

Leave a Reply