“అమిత్ షాను కలిసే అవకాశo కల్పించండి” -కిషన్ రెడ్డికి గద్దర్ విన్నపం!

Share Icons:
  • తనపై  కేసుల గురించి చర్చించిన గద్దర్
  • అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాలని విన్నపం

ప్రజా గాయకుడు  గద్దర్ కేంద్ర హోమ్ మంత్రి అపాయంట్ మెంట్ కోరుతున్నారు. తనపై దేశవ్యాపితంగా అనేక కేసులు ఉన్నాయని,   కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసేందుకు సిద్ధమౌతున్నారు .  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని హైద్రాబాద్ లో కలిసి  విజ్ఞప్తి చేశారు. తాను నక్సలిజాన్ని 1990 దశకంలోనే వదిలి పెట్టానని గత మూడు దశాబ్దాలుగా జన జీవన స్రవంతి లో కలిసే ఉన్నానని అయినప్పటికీ తనపై కేసులను ఎత్తి వేయలేదని దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా కలిసి విజ్ఞప్తి చేసానని చెప్పారు. గద్దర్ కేంద్ర హోమ్ మంత్రిని కలుస్తానని అందుకు తనకు ఆపాయిట్మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డి ని కోరడం ఆశక్తిగా మారింది.

తనపై కేసులను ఎత్తేయడానికి, న్యాయ సహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని గతంలో గద్దర్ కోరారు. 1997 ఏప్రిల్ 6న తనపై హత్యాయత్నం జరిగిందని,  వెన్నుపూస వద్ద బుల్లెట్ ఇప్పటికీ ఉందని చెప్పారు.  బుల్లెట్ వల్ల తనకు అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయని, అప్పటి నుంచి తాను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply