TRENDING NOW

రాజ్యసభకు గద్దర్… మండలికి మంద క్రిష్ణ..!?

రాజ్యసభకు గద్దర్… మండలికి మంద క్రిష్ణ..!?
హైదరాబాద్, డిసెంబర్ 6,

తెలంగాణ ముందస్తు ఎన్నికలు దేశ రాజకీయాల లో కొత్త మార్పులను తీసుకురానున్నాయా..? దశాబ్దాలు గా బ్యాలెట్ కాదు.. బుల్లెట్ అని నమ్మిన వారు ఉద్యమాలే ఊపిరి అనుకున్న వారు ఏలికలు కాబోతున్నారా.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను గద్దె దించేందుకు కాంగ్రెస్ తెలంగాణ జన సమితి తెలుగుదేశం పార్టీ సీపీఐ మహాకూటమి గా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమికి అనధికారికంగా ప్రజాగాయకుడు గద్దర్ ఉద్యమకారుడు మంద క్రిష్ణ మాదిగ బహిరంగంగా మద్దతు పలికారు. వీరిద్దరు మహాకూటమి ప్రచార వేదికల పై కూటమి అభ్యర్దులను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ లో ఈ ఇద్దరు నాయకుల ప్రభావం తీవ్రంగానే ఉంటుంది.

ఈ విషయాన్ని ముందే గమనించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరిద్దరి తో వ్యక్తిగతంగా సమావేశమైనట్లు చెబుతున్నారు. గద్దర్ అయితే తన కుటుంబ సభ్యుల తో కలసి ఢిల్లీ లో సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కలుసుకున్నారు. తెలంగాణ ప్రచార సభలలో  గద్దర్ తన పాటలతోను మంద క్రిష్ణ మాదిగ తన ప్రసంగంతోను ప్రజలను ఆకట్టుకున్నారు. వారిద్దరూ చేసిన ఈ పాట మాట సాయానికి తగిన ప్రతిఫలం చూపించాలని రాహుల్ గాంధీ మహాకూటమి శ్రేణుల తో  అన్నట్లు సమాచారం. ఈ సాయంలో భాగంగా కళాకారుల కోటలో గద్దర్‌ను రాజ్యసభకు గవర్నర్ కోటలో మంద క్రిష్ణ మాదిగను తెలంగాణ శాసన మండలికి పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెమీఫైనల్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు విజయం సాధిస్తే కేంద్రంలో తామూ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ నమ్మకంగా ఉన్నారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

అదే జరిగితే ప్రజాగాయకుడు గద్దర్ పోరాట నాయకుడు మంద క్రిష్ణ మాదిగలకు పదవులు ఇవ్వడం ఖాయమంటున్నారు.వీరిద్దరికి ఈ పదవులు ఇవ్వడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆదివాసీయులు దళితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో వీరి చేత ప్రచారం చేయించాలని రాహుల్ ఆలోచనగా చెబుతున్నారు. ఛత్తీస్‌గడ్‌తో పాటు నక్స్‌ల్స్ ప్రభావం ఉన్న రాష్ట్రాలలో గద్దర్ ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ జన సమితి నాయకుడు కోదండ రామ్‌కు కూడా తెలంగాణ ప్రభుత్వంలో మంచి పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచన. కోదండ రామ్ ప్రొఫెసర్‌గా ఇతర యూనివర్సిటీలలో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి.  సార్వత్రిక ఎన్నికలలో దేశంలో వివిధ యూనివర్సిటీలలో కోదండ రామ్ చేత కాంగ్రెస్  అనుకూల ప్రచారం చేయించాలని రాహు ల్ గాంధీ భావిస్తున్నారు.

మామాట: మంచిదే.. అవి పెద్దల సభలు కావు పునరావాసాలు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: