నమస్తే ట్రంప్: ఇండియాలో 36 గంటలు ట్రంప్ ఏం చేస్తారంటే?

Share Icons:

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 36 గంటల పర్యటన కోసం ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అయినప్పటి నుంచి ఆయన షెడ్యూల్ పూర్తి టైట్‌గా ఉండనుంది. నమస్తే ట్రంప్ కార్యక్రమం నుంచి ఆగ్రా తాజ్‌మహల్ సందర్శన వరకు ట్రంప్ బిజీగా గడపనున్నారు.

ఫిబ్రవరి 24

11.40- అధ్యక్షుడు ట్రంప్​ అహ్మదాబాద్​ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో అగ్రరాజ్యపు అధినేత ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలుకుతారు. ఇక అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబర్మతీ ఆశ్రమంకు రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు. అక్కడ ట్రంప్ జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. ఇక ప్రధాని మోడీ ట్రంప్‌కు మహాత్ముడి మొమెంటో, మరియు చరఖాతో పాటుగా పుస్తకాలు బహూకరిస్తారు.

అక్కడి నుంచి ట్రంప్-మోడీలు మొతేరా స్టేడియంకు చేరుకుంటారు. అక్కడే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. ట్రంప్ దంపతులతో పాటు ప్రధాని మోడీ కూడా ఈకార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి 1.25 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఇక ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నమస్తే ట్రంప్ కార్యక్రమం తర్వాత డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు.

ఫిబ్రవరి 25: ఉదయం 10- రాష్ట్రపతి భవన్​లో స్వాగత కార్యక్రమం. 10.30- రాజ్​ఘాట్​లోని మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు. 11.00- హైదరాబాద్​ హౌస్​లో ప్రధాని మోదీతో భేటీ. 12.40- ఒప్పందాలు/పత్రికా ప్రకటనరాత్రి. 7.30- రామ్​నాథ్​ కోవింద్​తో రాష్ట్రపతి భవన్​లో భేటీరాత్రి.  10.00- అమెరికాకు పయనం​ ఉంటుంది.

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు, స్వాగత ఏర్పాట్లలో నిమగ్నమైన గుజరాత్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మరోసారి మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్‌కు ఆనుకునే ఉన్న ఆనంద్ జిల్లాలో ఈ ఘటనలు సంభవించాయి. నెలరోజుల వ్యవధిలో ఈ మత ఘర్షణలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి కావడం, ట్రంప్ దంపతుల పర్యటనకు కొన్ని గంటల ముందు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ దాడులు, ప్రతి దాడుల్లో ఆస్తినష్టం భారీగా సంభవించింది. ఆనంద్ జిల్లాలోని ఖంభట్ ప్రాంతాలో ఆదివారం సాయంత్రం వాగ్వివాదంతో ఆరంభమైన ఈ ఘటన.. దాడులు, ప్రతిదాడులకు దారి తీసినట్లు పోలీసులు వెల్లడించారు.

 

Leave a Reply