ఆరోగ్యంలో మన తెలుగు రాష్ట్రాల ర్యాంకులెంతో తెలుసా..?

Share Icons:

ఢిల్లీ, 10 ఫిబ్రవరి:

దేశంలోని ఆరోగ్యకరమైన రాష్ట్రాల జాబితాలో మన తెలుగు రాష్ట్రాలు వరుసగా 8, 11 స్థానాల్లో నిలిచాయి.

శుక్రవారం నీతి ఆయోగ్ ఆరోగ్యకరమైన రాష్ట్రాల జాబితాని విడుదల చేసింది. అయితే పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు వేర్వేరుగా ఈ జాబితాలను రూపొందించారు.

అందులో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తొలి స్థానాన్ని కేరళ రాష్ట్రం దక్కించుకోగా, ఇక తర్వాతి స్థానాల్లో 2. పంజాబ్, 3. తమిళనాడు, 4.గుజరాత్, 5. హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి.

ఇక చిన్న రాష్ట్రాల జాబితాలో మిజోరాం మొదటి స్థానంలో నిలవగా, మణిపూర్, మేఘాలయ, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్ ఆరోగ్యకరమైన ప్రాంతంగా నిలిచింది. కాగా, ఆరోగ్యకరమైన పెద్ద రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ చివరిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.

ఈ జాబితాను నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్, వరల్డ్ బ్యాంకు (ఇండియా) డైరెక్టర్ జునైద్ అహ్మద్ విడుదల చేశారు. వరల్డ్ బ్యాంక్ ఇండియా, ఆరోగ్య మంత్రిత్వ శాఖల నుంచి సేకరించిన వివరాల ద్వారా ఈ జాబితాను రూపొందించామని వారు తెలిపారు.

మామాట: గొప్పలు చెప్పే ముఖ్యమంత్రులు  మీ ఆరోగ్యాలు చెక్ చేసుకోండి. 

English summary:

Our Telugu states are ranked 8th and 11th in the country’s healthy states list. Friday  Niti Aayog has released a list of healthy states. However created these lists separately for the larger states and smaller states.

Leave a Reply