నగరంలో జీహెచ్ఎంసీచే లక్ష గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ

Share Icons:

హైదరాబాద్, సెప్టెంబర్ 10 :

హైదరాబాద్ నగరంలోని చెరువులు కలుషితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలో భాగంగా గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది.

ప్రస్తుత వినాయక పండగ సందర్భంగా  లక్ష మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లను చేపట్టింది.

దీనిలో భాగంగా  ఆరు జోన్లకు 17,000 చొప్పున ఉచితంగా అందజేయడానికి కేటాయించారు. 8ఇంచ్ల ఈ మట్టి వినాయకులను  జోనల్ కమిషనర్లు సంబంధిత డిప్యూటి కమిషనర్ల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలియజేశారు.

ఎల్బీనగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లకు 17,000 విగ్రహాల చొప్పున, చార్మినార్, కూకట్‌పల్లి జోన్లకు 16,000 చొప్పున మట్టి విగ్రహాలను కేటాయించామని కమిషనర్ తెలిపారు.

మామాట: మంచి నిర్ణయం…

Leave a Reply