సూపర్ ఆఫర్.. ఏమిటో అది

సూపర్ ఆఫర్.. ఏమిటో అది
Views:
24

మాస్కో, జూలై 11, థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన 12 మంది హీరోలకు ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సాధించిన విజయాన్ని అంకితమిస్తున్నట్లు ఫ్రాన్స్‌ ఆటగాడు పాల్‌ పోగ్బా ప్రకటించాడు. తొలి సెమీఫైనల్లో 1-0 తేడాతో బెల్జియంపై ఫ్రాన్స్ గెలుపొందింది. సెమీఫైనల్లో గెలవడంతో ఫ్రాన్స్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది.

కాగా, గుహ నిర్బంధంలో చిక్కుకున్న 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు  ఫైనల్‌ మ్యాచ్‌ని చూసేందుకు రావాలంటూ ఆహ్వానించారు. మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఫ్రాన్స్‌ క్రీడాకారుడు పాల్ మ్యాచ్ విజయాన్ని థాయలాండ్‌ బాలల ఫుట్‌బాల్‌ జట్టుకు అంకితమిస్తూ ట్విట్ చేశాడు. 12 మంది బాలల ఫొటోలను కూడా పాల్‌ ట్వీట్ చేశాడు. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌-క్రియేషియా పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

 

మామాట: పిల్లలకు మంచి, మరచిపోలేని బహుమతి.

(Visited 31 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: