మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి పెరిగిన నిధులు

Share Icons:

 ముంబై, సెప్టెంబర్ 09,

జూలై మాసాంతానికి 23.06 లక్షల కోట్లుగా ఉన్న బేస్ అసెట్స్ ఆగస్టు చివరికి 25 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. మ్యూచువల్ ఫండ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు చివరి నాటికి మూల ఆస్తుల విలు 25 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించడం రికార్డుగా నమోదైంది. ఒక్క నెలలోనే 8.41 శాతం పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్‌కు ఈ అరుదైన అవకాశం సాధ్యమైంది.

రిటైల్ మదుపరులు క్రియాశీలకంగా వ్యవహరించడంతో, మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లో పెరిగిందని ఈ రంగంలో ఎసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం)గా వ్యవహరిస్తున్న ఎంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూలై మాసాంతానికి 23.06 లక్షల కోట్లుగా ఉన్న బేస్ అసెట్స్ ఆగస్టు చివరికి 25 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది ఇదే కాలానికి ఇది 20.6 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ విషయాన్ని ఎంఫి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్‌ఎస్ వెంకటేశ్ పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు.

సిస్టమేటిక్ ఇనె్వస్ట్‌మెంట్ ప్లాన్స్ (ఎస్‌ఐపీ) ద్వారా చేరుతున్న ఇన్‌ఫ్లోతోపాటు రిటైలర్లు కూడా మ్యూచువల్ ఫండ్స్‌కు మొగ్గు చూపడంతో, ఇన్‌ఫ్లో మరింతగా పెరిగిందని వెంకటేశ్ తెలిపారు. 2014 మే మాసాంతంలో మొదటిసారి 10 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని చేరిన అసెట్ బేస్ నాలుగేళ్ల కాలంలోనే రెట్టింపు కావడం విశేషం. భవిష్యత్తులోనూ ఈ పరుగు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

మామాట:  పెట్టుబడులు పెరుగుతున్నాయనమాట. మంచిదే

Leave a Reply