అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.హెచ్.డబ్ల్యూ బుష్ కన్నుమూత

Share Icons:

వాషింగ్టన్, 1 డిసెంబర్:

అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ జార్జ్.హెచ్.డబ్ల్యూ బుష్ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న జార్జ్ బుష్ హూస్టన్ లోని స్వగృహంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

అమెరికా 41వ అధ్యక్షుడిగా వ్యవహరించారు జార్జ్‌బుష్. ఇక బుష్ కుమారుడు జూనియర్ జార్జ్ బుష్ కూడా అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేయగా, మరో కుమారుడు జెఫ్ బుష్ టెక్సాస్ కు గర్నవర్ గా పనిచేశారు.

మసాచుసెట్స్ లోని మిల్టన్ లో 1924, జూన్ 12న బుష్ జన్మించారు. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ)కు డైరెక్టర్ గా పనిచేశారు. రిపబ్లికన్ పార్టీలో చేరిన బుష్ అంచలంచెలుగా పార్టీలో ఎదిగారు. నిక్సన్ హయాంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా విధులు నిర్వహించారు. అలాగే 1981-89 మధ్యకాలంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి అమెరికా 41వ అధ్యక్షుడిగా(1989-93) ప్రమాణస్వీకారం చేశారు. ‘

కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో సీనియర్ జార్జ్ బుష్ భార్య బార్బరా బుష్ చనిపోయారు. సీనియర్ జార్జ్ బుష్‌కి ఐదుగురు పిల్లలు, 17 మంది మనవలు, మనవరాళ్లు.

మామాట: అమెరికాకి బుష్ అందించిన సేవలు మరువలేనివే అని చెప్పొచ్చు…

 

Leave a Reply