ఆపరేషన్ కమలం: బీజేపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

tdp mla's condemn the news to spread they are ready to join bjp
Share Icons:

అమరావతి:

 

ఆపరేషన్ కమలం పేరుతో బీజేపీ…..ఏపీలో పలువురు టీడీపీ నేతలనీ తమ పార్టీలో చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బీజేపీలో చేరగా…మరికొందరు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి దూరంగా ఉంటున్న పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.

 

గన్నవరంలోని ఆయన ఆధ్వర్యంలో గతంలో నడిచిన టీడీపీ కార్యాలయాన్ని ఇప్పుడు బీజేపీ కార్యాలయంగా మార్పు జరుగుతోంది. రంగులు వేసి ఆ పార్టీ జెండాలతో సిద్ధం చేస్తున్నారు. ఈనెల 24 లేదా 25 తేదీల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోనున్నట్టు సమాచారం.

 

ఇక టీడీపీ నేతలతోపాటు జనసేన, కాంగ్రెస్ లోని తూర్పుగోదావరిలోని కొందరు నేతలు బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. అటు  ఉభయగోదావరి జిల్లాల్లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాల్లో పర్యటనలు జరిపిన ఆమె శనివారం అమలాపురంలోని కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ హాలులో జరిగే రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల శక్తికేంద్రాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

 

ఇదిలా ఉంటే టీడీపీ నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాజీ ఛైర్మన్‌ సైకం జయంచంద్రారెడ్డి బీజేపీలోకి చేరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ శుక్రవారం అవిలాలలోని సైకం ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా కన్నాను శాలువా, పుష్పగుచ్చంతో సైకం సత్కరించారు. ఈ సమయంలోనే సంప్రదింపులు జరిగాయన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయమై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కన్నాకు సైకం చెప్పారని సమాచారం.

Leave a Reply