ట్రంప్‌తో అఫైర్ ఉందంటున్న మరో మోడల్..!!

Share Icons:

అమెరికా, 21 మార్చి:

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో ఇరకాటంలో పడ్డారు. ట్రంప్ తో తనకు శారీరక సంబంధం ఉందని ఇటీవల పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నుంచి ఇంకా ట్రంప్ బయటపడనేలేదు.. మరో వివాదంలో ఇరుక్కున్నారు.

తాజాగా ప్లేబాయ్ మ్యాగజైన్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్ .. ట్రంప్ తో తనకు అఫైర్ ఉందని ప్రకటించింది. అంతేకాదు.. ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని.. దానిని ర‌ద్దు చేయాలని కోరతూ ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు.

2006-07 ట్రంప్ భార్య మెలానియా గ‌ర్భ‌వ‌తిగా ఉన్న స‌మ‌యంలో ట్రంప్ త‌న‌తో 10 నెల‌ల‌పాటు శృంగార కార్య‌క‌లాపాల్ని కొన‌సాగించాడని, అప్పుడు మెలానియా  బారెన్‌ (కుమారుడు)కు జన్మనిచ్చింది. అదే స‌మ‌యంలో ఫోర్న్ స్టార్‌తో కూడా  ట్రంప్ త‌న వివాహేత‌ర సంబంధాన్నిపెట్టుకున్నాడ‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ పోర్న్ స్టార్ డానియేల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడు. ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ తనతో రహస్యంగా సంప్రదింపులు జరిపారని మెక్ డౌగల్ ప్రకటించారు.

ఇక త‌నకు – ట్రంప్ మ‌ధ్య ఉన్న సంబంధాన్ని బ‌య‌ట‌కు పొక్క‌కుండా త‌న స్నేహితుడు డేవిడ్ పెక‌ర్ నిర్వ‌హిస్తున్న అమెరికా మీడియా ఇంక్ త‌రపున త‌న‌కు లక్లా 50వేల డాలర్లు చెల్లించిన‌ట్లు ఒప్పుకుంది.

ఇప్పుడు ఆ ర‌హ‌స్య బంధం నుంచి త‌న‌ని విముక్తి చేయాలంటూ క‌రెన్ మెక్ డౌగ‌ల్ కోర్టును ఆశ్రయించింది. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ట్రంప్ స్పందించకపోవడం గమనార్హం.

మామాట: అందరు ఒకేసారి వచ్చేస్తున్నారుగా…

English Summary: A former Playboy model who allegedly had a 10-month affair with President Donald Trump is suing the company that kept her original account from publication. Karen McDougal is suing to be released from an agreement mandating her silence.

Leave a Reply