జగన్ అవగాహనా రాహిత్యం రాష్ట్రానికి చేటు చేస్తుంది…

Share Icons:

విశాఖపట్నం: ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలను చూసి చాలా బాధపడుతున్నానని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు.  అభివృద్ధి పనులను పక్కన పెట్టి మంత్రులు, ప్రభుత్వం అనవసరపు రగడ సృష్టించిందని విమర్శించారు. అమరావతిలో రాజధాని కట్టలేని ప్రభుత్వం మూడు చోట్ల ఎలా రాజధాని కడుతుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల భిన్నాభిప్రాయాలు వారి వ్యక్తిగతం అని ఆయా ప్రాంతాల ప్రజల అభీష్టం మేరకు వారు మాట్లాడుతున్నారని సబ్బం హరి చెప్పారు. అందులో తప్పేమీ లేదన్నారు. జగన్ అవగాహనా రాహిత్యం రాష్ట్రానికి చేటు చేస్తుందని సబ్బంహరి తెలిపారు. అమరావతిని విచ్ఛిన్నం చేయొద్దని సీఎం జగన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సహనానికి జగన్ పరీక్ష పెట్టొద్దన్నారు.

ఇక అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే వ్యాఖ్యలపై మాట్లాడిన సబ్బంహరి ఆధారాలు ఉంటె చర్యలు తీసుకోవాలి కానీ ఆరోపణలు చేసుకోవటం మంచిది కాదని చెప్పారు. టీడీపీ నేతలు ఏపీ రాజధాని అమరావతిలోభూములు కొన్నారని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు అని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. అదే సమయంలో వైజాగ్ లో వైసీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని టీడీపీ నేతలు సైతం రివర్స్ ఎటాక్ చెయ్యటం మంచిది కాదని ఆయన చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే మాట బూతు మాట అని ఆయన తేల్చి చెప్పారు.

ఏపీ మంత్రిపై బీజేపీ నేత పరువు నష్టం దావా

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై మాజీమంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై మంత్రి బుగ్గన చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. తనకు రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయనడం అవాస్తవమని ఆయన అన్నారు. ఈ విషయంలో తనపై అనవసర ఆరోపణలు చేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నట్టు రావెల కిశోర్ బాబు తెలిపారు. తన నోటీసు అందిన తరువాత బుగ్గన తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిని తరలించేందుకు కుట్ర జరుగుతోందని రావెల ఆరోపించారు. వైసీపీ అనుకూల మీడియా దీనిపై గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

 

Leave a Reply