చంద్రబాబుపై మాజీ ఐఏఎస్‌ల పిర్యాదు

Share Icons:

అమరావతి, ఏప్రిల్ 17,

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సరళి సరిగా అమలుకాలేదని ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ అందరూ కేంద్రానికి తలొగ్గి వైకాపాకు అనుకూలంగా పనిచేశారని ఢిల్లీలో పంచాయితీ పెట్టారు. చంద్రబాబు ఇలా ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తుండటం సమంజసం కాదని మాజీ ఐఏఎస్ అధికారులు అంటున్నారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 35 మంది విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నర్ ను కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, గోపాల్ రావు, భట్టాచార్య తదితరులు మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ మార్పులో ఏపీ సీఎస్ పై బాబు ఆరోపణలు చేయడంపై నిరసన తెలిపారు.

నిజాయితీగా పనిచేస్తున్న అధికారులపై ఇలా రాజకీయలబ్ది కోసం అనవసర ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని, తమ చర్యల వెనుక ఏ రాజకీయ పార్టీలేదని, తాము నిజాయితీగా పనిచేయబట్టే సిస్టం కరెక్టుగా నడుస్తోందని అన్నారు.

మామాట: నిజాయితీ అధికారులను ఈసీ మార్చితే.. ఫరవా లేదా

Leave a Reply