బీజేపీలోకి మాజీ డిప్యూటీ సీఎం…?

ap and telangana bjp leaders sensational comments
Share Icons:

హైదరాబాద్:

తెలంగాణలో బలోపేతం అవ్వడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న బీజేపీ…ఇతర పార్టీల నాయకులని చేర్చుకోవడంలో దూసుకెళుతుంది. ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేరిపోగా, మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చల తర్వాత ఆయన కమలం తీర్థం పుచ్చుకోనున్నారు.

అమిత్ షాను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1989లో తొలిసారి ఆందోల్ అసెంబ్లీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత మరో రెండుసార్లు ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2006లో ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో గెలిచిన తర్వాత వైఎస్, రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి బాబు మోహన్, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ చేతిలో దామోదర రాజనర్సింహ ఓటమిపాలయ్యారు.

Leave a Reply