పులులు గణన వాలంటీర్లకు అటవీశాఖ సర్టిఫికేట్లు

Share Icons:

హైదరాబాద్, 30 జనవరి:

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడువేల ఫారెస్ట్ బీట్లలో పులులు, ఇతర జంతువుల లెక్కింపు ఈ నెల 22న మంత్రి జోగు రామన్న ఆద్వర్యంలో ప్రారంభమైంది.

అయితే ఈ లెక్కింపు సోమవరంతో ముగిసింది. ఈ జంతుగణనలో సుమారు 500 మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో పులుల గణనలో పాల్గొన్న వాలంటీర్లతో అరణ్య భవన్‌లో అటవీశాఖ  అధికారుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జంతుగణనలో పాల్గొన్న వాలంటీర్ల అభిప్రాయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అలాగే అటవీ, జంతు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. అనంతరం వాలంటీర్లకు అటవీశాఖ తరుపున సర్టిఫికేట్లు ప్రధానం చేశారు.

మామాట: మరి పులుల గణనకి సంబంధించిన లెక్కలు ఎప్పుడు తెలుస్తాయో?

English summary: Minister Jogu Ramanna were started Tigers and other animal counters in Telangana state. And it started 22nd of this month nearly three thousand forest beats. And animal counting ended yesterday. More than 500 volunteers participated in the animal count.

Leave a Reply