ఫిఫా…నాకౌట్‌కి చేరిన జట్లు ఇవే…

Football world cup 16 teams reached knockout stage
Share Icons:

మాస్కో, 29 జూన్:

రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ పోటీలో గ్రూప్ దశ మ్యాచ్లు ముగిశాయి. రేపటి నుంచి నాకౌట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్‌ ప్రపంచకప్‌ నాకౌట్లో అడుగుపెట్టగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. అర్జెంటీనా అతికష్టం మీద ముందంజ వేసింది.

మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించగా, వాటినుంచి 16 జట్లు నాకౌట్ స్టేజ్ లోకి వచ్చాయి. ఈ జట్ల నుంచి 8 జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించనున్నాయి.

ఇక రేపు ఫ్రాన్స్ – అర్జెంటీనాల మధ్య తొలి నాకౌట్ మ్యాచ్ జరగనుంది.

నాకౌట్ (ప్రీ క్వార్టర్స్) షెడ్యూల్:

శనివారం, 30 జూన్

మ్యాచ్ 49: ఫ్రాన్స్ (గ్రూప్ సి విజేత) vs అర్జెంటీనా (గ్రూప్ డి రన్నరప్)

మ్యాచ్ 50: ఉరుగ్వే (గ్రూప్ ఏ విజేత) vs పోర్చుగల్ (గ్రూప్ బీ రన్నరప్)

ఆదివారం, 1 జూలై

మ్యాచ్ 51: స్పెయిన్ (గ్రూప్ బి విజేత) vs రష్యా (గ్రూప్ ఎ రన్నరప్)

మ్యాచ్ 52: క్రొయేషియా (గ్రూప్ డీ విజేత) డెన్మార్క్ vs (గ్రూప్ సి రన్నరప్)

సోమవారం, 2 జూలై

మ్యాచ్ 53: బ్రెజిల్ (గ్రూప్ ఇ విజేత) vs మెక్సికో (గ్రూప్ ఎఫ్ రన్నరప్)

మ్యాచ్ 54: బెల్జియం (గ్రూప్ జి విజేత) జపాన్ vs (గ్రూప్ హెచ్ రన్నరప్)

మంగళవారం, 3 జూలై

మ్యాచ్ 55: స్వీడన్ (గ్రూప్ ఎఫ్ విజేత) స్విట్జర్లాండ్ vs (గ్రూప్ ఈ రన్నరప్)

మ్యాచ్ 56: కొలంబియా (గ్రూప్ హెచ్ విజేత) vs ఇంగ్లాండ్ (గ్రూప్ జీ రన్నర్-అప్)

మామాట: మరి తర్వాత రౌండ్‌కి ఏ జట్లు వెళతాయో..?

Leave a Reply