అరటి ఆకులో భోజనం – ఆరోగ్యకరం

Share Icons:

భోజనం భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆహారం లోనికి తీసుకోవడమే కాదు, ఎలా, ఎందులో తినాలో కూడా మన పూర్వులు నిర్ణయించారు. మన సంప్రదాయం ప్రకారం

అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి ఆకుల్లో సహజ సిద్ధమైన కార్బన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో భోజనం చేస్తే ఈ సహజ కార్బన్ సమ్మేళనాలు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులను నిలువరించడంలో సాయపడుతాయి. అరటి ఆకులో తినడం ద్వారా  శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.

The body needs a variety of the following 5 nutrients – protein, carbohydrate, fat, vitamins and minerals – from the food we eat to stay healthy and productive. Protein – is needed to build, maintain and repair muscle, blood, skin and bones and other tissues and organs in the body.   అన్నది ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. దీనిని మనవారు ఎపుడో గుర్తించారు.

అరటి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుటలో సహాయపడుతుంది. సూక్ష్మ జీవులను నాశనం చేస్తుంది.  అరటి  ఆకులలో భోజనం చేయడం వలన ప్లేగుల్లోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అరటి చెట్టు నుంచి వచ్చే అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

అరటి పండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను కూడా అరికట్టడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది. అరటిపండు అల్సర్లను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది. ఇన్ని మంచి గుణాలున్నాయి కనుకనే పెద్దలు అరటి ఆకులో భోజనంచేయమన్నారు.

 

మామాట : పెద్దలమాట చద్దిమూట అన్నారుగా… ఆచరిద్దాం 

Leave a Reply