ఆహారం-20 రకాల అవాస్తవ నమ్మకాలు

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 09,

అవును మీరు చదువుతున్నది నిజమే.. మనం చాలా కాలంగా మంచివని నమ్మి ఏం తింటున్నామో వాటిగురించిన శాస్త్రీయ ఆధారాలు లేవు. అదే సమయంలో ఇవి చెడ్డవని తినకుండా మానేసినవి కూడా చెడ్డవో కాదో శాస్త్రీయంగా రుజువులు లేవు. అలాంటి దాదాపు 20 మూఢనమ్మకాలను ఆహారానికి సంబంధించిన అవాస్తవాల గురించీ ఇపుడు మనం తెలుసుకుందాం. అవన్నీ పుక్కిటి పురాణాలేనా అంటే… చదవండి మీకే తెలుస్తుంది.

చాక్లెట్ ఒక నిరోధకం..

సుమారు 1980వ దశకం నుంచీ చాక్లెట్ మంచిది కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. అయినా ఏటా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం రోజున కిలోల కొద్దీ చాక్లెట్లు అమ్మడవుతూనే ఉంటాయి. చాక్లెట్ తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. వీటి రెంటికీ సంబంధం ఉన్నటు ఎక్కడాచెప్పలేదు. అయితే ప్రజలు చాక్లెట్ తో శృంగారభావనలను ముడిపెట్టి చూడ్డం అలవాటు చేసుకున్నారు. చాక్లెట్ ను తలచుకుంటేనే కొందరికి మూడొస్తుందంటే… శాస్త్రంతో పనేంటి.. కానీయండి…

ఫ్యాట్ తింటే ప్యాటీగా మారుతారా..

నిజానికి అవకోడ, వాల్ నట్ట్స్, ఆలివ్ ఆయిల్ తదితర హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి శక్తినివ్వడానికి సహకరిస్తున్నా, ఫ్యాట్ తింటే ఫ్యాటీగా మారిపోతామనే పురాణం బాగావ్యాపించింది.

అందుకే చాలా మంది మహిళలు ప్యాటే తినడానికి సంకోచిస్తూ ఉంటారు. 1980-90 ల నుంచీ లో ఫ్యాట్ ఫీవర్ అందరికీ అంటుకుంది. నిజానికి హెల్తీ ఫ్యాట్ తీసుకుంటూ, రీఫైండ్, కార్బోహైడ్రేడ్ తగ్గిస్తే మరింత ఫిట్ గా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. దీనికి తోడు శరీర వ్యాయామంతో ఫ్యాట్ ని అదుపులో ఉంచుకుంటే సరి.

క్యారెట్ తింటే కంటికి మంచిదా..

క్యారెట్ తింటే కంటికి చాలా మంచిదనే మాట వింటూనే మనం పెరిగి పెద్దయ్యాం. మన కంటి సమస్యలు పెరిగాయా, అలాగే ఉన్నాయా తెలియదు. క్యారెట్ శరారానికి మంచిది, అందులో కంటి చూపు మెరుగు పరిచేందుకు ఉపకరించే విటమిన్ ఏ ఉన్నా,  హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు కంటి చూపు పెంచడంలో తాజా పళ్లు, ఆకు కూరలు, క్యారెట్ కంటే మెరుగ్గా పనిచేస్తాయని చెబుతున్నాయి.

బబుల్ గమ్ జీర్ణం కావడానికి ఏడేళ్లు పడుతుంది..

చిన్న పిల్లలయినా, పెద్దలే అయినా కలవర పెట్టే సమస్య ఏమిటంటే… బబుల్ గమ్ పొరబాటున మింగేస్తే ఎట్లా…?   అది కడుపులోకి చేరితే, అరగడానికి ఏడు సంవత్సరాలు పడుతుందనే భయం. అది నిజం కాదు. జీర్ణాశయానికి సంబంధించినంత వరకూ  బబుల్ గమ్ సమస్యే కాదు, ఇతర ఆహారం లాగానే.. పై దారి నుంచి వస్తుంది, అలాగే కింది దారి నుంచీ బయటికి వెళ్లిపోతుంది.

పప్పులు తప్పని సరి..

సాధారణంగా సూపర్ మార్కెట్లో జంక్ ఫుడ్ కే ప్రాధాన్యం ఇస్తు ఉంటారు. వాటిని వదిలిపెట్టండి. పీచు అధికంగా ఉండే గింజలు, ప్రోటీన్ కలిగి ఉండే మొక్కల నుంచి వచ్చే గింజలను తింటూ ఉండండి. బీన్స్ వంటి తక్కువ ధరలకే ఎక్కువ ఆరోగ్యం ఇచ్చే పదార్థాలు.

పాలు తాగితే ఎములకు బలం..

పాలు తాగుతున్నారా, ఎదిగే పిల్లలు రోజూ పాలు తాగండి ఎముకలు దృఢంగా ఉటాయి అనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. అది ప్రకటనలో ఉన్నంత మంచిదేమీ కాదు.  2010లో నూట్రీషన్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్ అనే పత్రికలో వచ్చిన సమాచారం మేరకు.. పాలవలన ఎముకల్లో కాల్షియం తగ్గుతున్నట్టు గుర్తించారు. నిజానికి ఇది పాలగురించీ చెప్పేదానికి పూర్తిగా విరుద్దంగా ఉంది.  ఇంకా ముందుకు వెళితే 2009లో  అమెరికా జర్నల్ ఆఫ్ క్లినికల్ నూట్రీషన్ లో వచ్చిన సమచారం విస్తుగొలిపేలాగా ఉంది. అందులో పాలు , డైరీ ఉత్పత్తులు అధికంగా తీసుకునే దేశాలలోనే ఎముకలు విరుగుతున్న కేసులు పెరుగుతున్నట్టు తెలిసింది. పాలు మానేసి, బాదాం తిందామా….

ఐదు సెకండ్లలో తింటే ఫరవాలేదు..

అవును చాలా మంది కింద పడ్డ ఆహారాన్ని ఐదే సెకన్లలోపల తీసుకుని తినేస్తే ఏమీ కాదని నమ్ముతారు. అంతా తప్పు… ఆహారం మన చేయి జారి కింద పడ్డ క్షణంలో వందో వంతులోనే బాక్టీరియా అందులోకి చేరిపోతుంది. అపరిశుభ్రంగా మారిపోతుంది. వెంటనే తీసుకుని తింటే.. ప్రయోజనం లేదు. కాక పోతే మీ ఫ్లోరింగ్ బాగా శుద్ధిచేసి మీరూ ప్రయత్నించండి…

జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు..

పాపం మహిళలు కిలో బరువు తగ్గుతారంటే జ్యూస్ ల కోసం వేలకు వేలు ఖర్చుచేసేస్తారు. అయితే దీనివలన పెద్దగా ప్రయోజనం ఉండకపోయినా, శరీరానికి కూడా మంచిది కాదు. మీరు కేవలం జ్యూస్ లు మాత్రమే తాగుతున్నట్టయితే, శరీరానికి రోజువారి కావలసిన పోషకాలు లోపిస్తున్నట్టే. త్వరగా బరువు తగ్గడానికి పళ్లరసాలపై ఆధారపడడం అంతమంచిపని కాదని నూట్రిషియన్ నిపుణులు చెబుతున్నారు. దీనికి మారుగా మీ మీ శరీతత్వానికి దగిన విధింగా పూర్తిస్థాయి భోజనం చేయడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ, ఝీవన శైలిలో మార్పులుచేసుకోవాలంటున్నారు. నిత్యం సంతోషంగా ఉండడం, పళ్లు, కాయగూరలు, ప్పులు, ప్రొటీన్లు, ఆరోగ్యకర ఫ్యాట్లతో సమతుల ఆహారం తీసుకోవడం ఉత్తమమైనదంటున్నారు.

టర్కీకోడి తింటే నిద్రపడుతుందా..

టర్కీకోడిలోని రసాయనాల కారణంగా ఫుల్ గా కోడి కూర తిని పడుకుంటే నిద్ర బాగా వస్తుందనే నమ్మకంలో ఏ మాత్రం అర్థం లేదని నిపుణులు చెబుతున్నారు. టర్కీ కోడిలోని ట్రెఫ్టోఫన్ అనే రసాయనం కారణంగా శరీరానికి విశ్రాంతి కలిగి, నిద్రవస్తుందనేది నమ్మిక, కానీ, ట్రెప్టోఫన్ రసాయణం ఇంకా చాలా రకాల ఆహార పదార్థాలలో ఉంటుందనేది గమనించాలి. నిజానికి టర్కీకోడి కూరతోపాటు ఫుల్ మీల్స్ లాగిస్తే… ఎవరైనా అలసిపోతారు.. అంతే.

ఆరోగ్యంగా ఉండాలంటే.. క్యాలరీల లెక్క తెలియాలా?

జనం చాలాకారణాలతో క్యాలరీల లెక్కలు తీస్తూ ఉంటారు. కానీ అందులో ముఖ్యమైనది బరువు తగ్గడం లేదా శరీర ఆరోగ్యం పై శ్రద్ధ కావచ్చు. అయితే ఈ నెంబర్లాట ఎంత మాత్రమూ అవసరం లేనిది. చాలా సూపర్ కంప్యూటర్లకంటే మానవ శరీరం ఎంతో ఉత్తమమైనది. అనవసరమైన ఆలోచనలు వద్దు.. సహజంగానే ఒక రోజు చాలా కలి వేస్తుంది, మరో రోజు అసలు తినబుద్ది కాదు… రోజువారీగా మంచినీళ్లు తగినన్ని తాగడం, ప్రోటీన్ లు, ఆరోగ్యకర ప్యాట్ లు తీసుకుంటూ, చెక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం తగ్గించడం చేస్తే చాలు, తక్కింది శరీరం చూసుకుంటుంది.

సేంద్రియ ఆహారం మీకు మంచిదా..

ఖరీదైనవి మంచివి.. అంతేనా? కాకపోవచ్చు. సేంద్రియ ఆహారంలో క్రిమిసంహారక మందులు  వంటి వి లేకపోయినా సరే. సాధారణ ఉత్పత్తులకంటే సేంద్రియ పదార్థాలు మేలైనవి అనే రుజువులు ఏవీ లేవు. 2012లో స్టాన్ పోర్డ్ విశ్వవిద్యాలయం సేంద్రియ, సేంద్రియ రహిత సాగుచేసిన ఆహారాన్ని పరిశీలించినపుడు తేడాలేవీ కనిపించలేదు. సేంద్రియ ఆహారంలో తక్కువ అనారోగ్యలక్షణాలున్నట్టు తెలియరాలేదు. అదిక ధరలకు కొనడం కాదు, మామూలుగా, పళ్లు, కాయగూరలూ తగినంత తింటూ ఉండండి, అవి ఖరీదైనవా కాదా అనే సందేహం వద్దు అంటున్నారు నిపుణులు.

రోజూ 8గ్లాసులకు తక్కువ కాకుం డా నీరు తాగాలి..

మంచినీళ్లు ఎన్ని తాగాలి అంటే, అందరూ ఏ మాత్రం తడుముకోకుండా, రోజూ 8 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగుతూ ఉంటే ఆరోగ్యంగా, డి హైడ్రేషన్ లేకుండా ఉంటారని తెలుసుకోండి. తమాషా విషయం ఏమిటంటే అదంతా ఓ పురాణం అంతే.. మోయోక్లినిక్ పరిశోధనల ప్రకారం నీరు తాగడం అన్నది పూర్తిగా వ్యక్తిగతం. రోజుకు తప్పనిసరిగా ఇన్ని నీరు తాగాలనే నియమం లేదు. మనిషి నివసించే ప్రాంతం, శరీరతత్వం,వయసు, ఆరోగ్యాన్ని అనుసరించి నీరు తీసుకోవాలి, ఆహార పదార్థాల నుంచీకూడా శరీరానికి కావలసిన నీరు అందుతుంది.

పిండి పదార్థాలు శరీరానికి మంచివి కావా..

పిండి పదార్థాలగురించిన అపవాదు చాలాకాలంగా మనలో నాటుకుపోయింది. మీడియాకూడా ఇవన్నీ శరీరానికి మంచి కావనే వాదననే ఇంతకాలంగా మోస్తూ ఉంది. కానీ నిజం ఏమిటంటే..ఇవి అంత భయపడవలసినవి కాదు.  శరీరం పనిచేయడానికి కార్బోహైడ్రేడ్ లు కావాలి. ఇక మీరు క్రీడాకారుడయితే  మీలోని క్రీడాశక్తి మెరుగుపడడానికి, కండరాల పెరుగుదలకు పిండిపదార్థాలు ఎంతో అవసరం. శరీరం సక్రమంగా ఎదగడానికి అవసరమైన గ్లైకోజన్ పిండి పదార్ధాల నుంచే వస్తుంది. అయితే ఈ మారు మీరు తినడానికి కూచున్నపుడు తెల్లబియ్యం, వైట్ బ్రెడ్, వైట్ పాస్తా పక్కన పెట్టి, బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్, పాస్తా తినండి.  బరువుకూడా తగ్గుతారు.

కాఫీతోఎదుగుదల ఆగిపోతుందా..

నువ్వు బడిలో చదువుకునేటపుడు మీ మమ్మీ నీకు కాఫీ ఇవ్వకుండా ఉండడానికి చెప్పే మాట కాఫీ తాగితే ఎదుగుదల ఆగిపోతుందని. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం కాఫీ తాగడం వలన ఎదుగుదల ఆగిపోతుందనే దానికి ఆధారం లేదు.  మనిషి ఎత్తును నిర్ణయించే ఆస్టోఫోరోసిస్ కి కాఫీకి సంబంధమే లేదు. మీ జన్యువులు, ఆరోగ్యం మీ పెరుగుదలను నిర్ణయిస్తాయి.  తల్లి దండ్రులు కూడా మీ రు పొడవు పెరగడం పెరగకపోవడాన్ని నిర్ణయిస్తారు. కాఫీ కాదు. సమతులాహారం తీసుకోవడం ముఖ్యం.  కాఫీకేం సంబంధం లేదు.

రోజంతా కొద్ది కొద్దిగా తింటూ ఉంటే మెటబాలిజం బాగుంటుంది..

మెటబాలిజం సమస్య అధిగమించాలంటే… రోజులు పలు మార్లు కొద్ది కొద్దిగా తింటూ ఉండాలనే సలహా వినిపిస్తు ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి రుజువులేవీ లేవు. 2013లో ఒబేసిటి అనే పత్రిక నిర్వహించిన పరిశోధనలో సాధారణంగా మూడు మార్లు భోజనం చేసేవారికీ, రోజుకు తక్కువ తక్కువగా ఆరు మార్లు భోజనం చేసేవారికీ మెటబాలిజంలో ఎటువంటి తేడాలేదని ప్రకటించారు. నిజానికి ఆరు మార్లు తినేవారిలోనే ఇంకా ఆకలి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇక మీ ఇష్టం.

గుడ్డు తింటే కొలస్ట్రల్ స్థాయి పెరుగుతుంది..

గుడ్డు ఆరోగ్యానికి మంచిదా, కాదా అనే విషయంలో మిశ్రమ భావాలున్నాయి. అయితే కొలస్ట్రల్ విషయంలో 2015 డైటరీ గైడ్ లైన్స్ చాలా ఖచ్చితంగా ఉన్నాయి.  గుడ్డులోని డైటరీ కొలస్ట్రాల్  రక్తంలోని కొలస్ట్రాల్ పై ప్రభావం చూపదని తెలిపారు. పైగా గుడ్డువలన చాలా లాభాలున్నాయట. గుడ్డులో కనీసం 6 గ్రాముల హైక్వాలిటీ ప్రొటీన్ ఉంటుంది.. ఇది శక్తినిస్తుంది. కాగా గుడ్డులోని చోలిన్ (choline) అనే పదార్ధం పసిపిల్లల  మానసిక ఎదుగుదలకు ఉపకరిస్తుందన్నారు. ఇంతలో ఐపోలేదు.. ఓ పెద్ద గుడ్డులో 1.6 గ్రాములసాచురేటెడ్ ప్యాట్ ఉంటుంది. దీనిని లెక్కలోకి తీసుకుని గుడ్డుని వాడుకోవాలి.. 2 వేల కేలరీల రోజువారి డైట్లో 20గ్రాములకు ఇది మించకూడదు.

ఎక్కువ పాలు తాగుతే.. ఎక్కవ కఫం చేరుతుందా..

కఫం పట్టుకుంటే ఉండే బాధ చెప్పుకోలేము. గొంతులో గర గర, గల్ల తో ఇబ్బందులుంటాయి. నిజమే, పాలు తాగితే కఫం పెరుగుతుంది.. మోయో క్లినిక్ నివేదిక ప్రకారం పాలు తాగడం ద్వారా కఫం తీవ్రత పెరుగుతుందని గుర్తించారు. కాస్త నలతగా, ఉన్నపుడు డైరీ ఉత్వత్తులు తినకపోవడమే నయం.

తెల్లటి పంచదార కంటే బ్రౌన్ షుగర్ మంచిదా..

మంచిది, చెడువార్తే ఇది… తెల్ల చెక్కరకు బదులుగా బ్రౌన్ షుగర్ వాడుతున్నారా… కాస్త ఆలోచించాల్సిందే.. క్లీవ్ లాండ్ క్లినిక్ పరిశోధనల మేరకు  ఈ రెండు రకాల పంచదార వాడడం వలన రుచిలో కాస్త తేడా ఉంటుందంతే.  ఆరోగ్యానికి సంబంధించినంత వరకూ… చెక్కెర చెక్కరే. రంగుతో పనిలేదు. పంచదార మీ రక్తంలోని చెక్కెర శాతాన్ని పెంచుతుంది. అది ఊబకాయం, మధుమేహం రావడానికి దారితీయవచ్చు.

శాకాహారం ద్వారా తగినంత ప్రోటీన్ అందదు..

ఆహారంలో ప్రోటీన్ గురించి ఆలోచించినపుడు సాధారణంగా ఎవరైనా గొడ్డు మాంసం, కోళ్లు, చేపలు, రొయ్యల వంటి సముద్ర ఉత్పత్తులు, గుడ్లు తదితర జంతు సంబంధ త్పత్తులగురించి ప్రస్తావిస్తుంటారు. మీకో శుభవార్త, ప్రోటీన్ ల కోసం మీరు అవే కాదు, సాధారణ మొక్కలపై కూడా ఆధారపడవచ్చు. చిక్కుడు, బీన్స్, సోయా వంటి వాటిలో 17 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. తినే ఆహారంలో ఏమేమి ఉన్నాయో చూసుకుని కాస్త జాగ్రత్తగా తింటే చాలు.

రోజూ ఓ ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదా..

మీ హారంలో రోజూ ఒక ఆపిల్ పండు ఉంటే మంచిదే. అయితే మీరను కునేంత మంచి కాదు.  హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం మేరకు  ఆపిల్ ఆరోగ్యకరమైన తిండే, స్నాక్స్ లో ఆపిల్ ఉంటే మంచిదే కానీ రోజూ పిల్ తింటే డాక్టర్ వద్దకు వెల్లవలసిన పనిఉండదు అనేది మాత్రం నిజం కాదు. కానీ, రోజూ ఆపిల్ తినేవారు ఇతరులతో పోల్చినపుడు కాస్త తక్కువసార్లు వైద్యుల వద్దకు వెళ్లినట్టు తెలిసింది.

మామాట:  ఆహారం తీసుకోవడంలో ఇన్ని మతలబులున్నాయా సామీ

Leave a Reply