ఆహారం కల్తీ చేస్తే..?

Share Icons:

న్యూఢిల్లీ, జూన్25, కాదేదీ కవితకనర్హం అన్నడు శ్రీశ్రీ.
కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. కాదేదీ కల్తీకనర్హం అంటున్నారు కొందరు వ్యాపారులు. మనం తినే అన్ని ఆహారపదార్థాలూ కల్తీ అవుతున్నాయేమోనని భయపడవలసి వస్తోంది. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల్లో కల్తీ పెరుగుతున్న నేపథ్యంలో కల్తీ నివారించేందుకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ఆహార పదార్థాలను కల్తీ చేసిన వారికి రూ.10లక్షల జరిమానా విధించడంతోపాటు వారికి జీవిత ఖైదు విధించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎఎఏఐ) ప్రతిపాదించింది. దీంతోపాటు కల్తీని నివారించేలా ‘ఫుడ్ సేఫ్టీ అండ్ న్యూట్రిషన్ ఫండ్’ ను కూడా ఏర్పాటు చేయాలని రెగ్యులేటర్ సూచించింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డు యాక్ట్ 2006 లో మార్పులు తీసుకువచ్చి సెక్షన్ 59 ప్రకారం ఆహారపదార్థాల కల్తీ చేసిన వారికి పదిలక్షల జరిమానాతోపాటు జీవిత ఖైదు కూడా విధించాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న కల్తీని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆహార కల్తీని నివారించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా చేసిన ప్రతిపాదనలు రాష్ట్రప్రభుత్వాలకు పంపించి దీనిపై వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజాభిప్రాయానికి తగ్గట్టు కొత్త చట్టంలో కఠిన నిబంధనలు పెట్టాలను కేంద్రం భావిస్తోందని సమాచారం.

 

మామాట: కల్తీ బుద్దులు పొకుండా ఆహారంలో కల్తీ పోతుందా!

Leave a Reply