రేపే బలం నిరూపించుకోవాలి.. యడ్డీకి సుప్రీం అగ్ని పరీక్ష

Share Icons:

న్యూ ఢిల్లీ, మే 18 :

కన్నడ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం యడ్యూరప్పకు అగ్ని పరీక్ష పెట్టింది. రేపటిలోపు బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. ఈ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్-జేడీఎస్‌లకు ఊరటనివ్వగా బీజేపీలో కలవరం రేపుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ వేసిన కేసులో శుక్రవారం దీనిపై ఏకె సిక్రి, ఎస్ఏ బోడే, అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నతరువాత కీలక వ్యాఖ్యలు చేసింది. రేపు అసెంబ్లీలో యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. సమయం కూడా కోర్టే నిర్ణయించింది. సాయంత్రం 4 గంటలకు ఈ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.

దీనిపై బీజేపీ లాయర్ ముకుల్ రోహల్గీ వారం రోజులు గడువు కోరారు. దీన్ని సుప్రీం తిరస్కరించింది. అనంతరం సీక్రెట్ ఓటింగ్ కు అనుమతి కోరగా..ఆ విన్నపాన్ని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం తోచిపుచ్చింది.

అందులోనూ ఎక్కడా రహస్య ఓటింగ్ జరగరాదని, బహిరంగ ఓటింగ్ తోనే బలనిరూపణ చేయాలని ఆదేశాలు జారీచేసింది. జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీలలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.

మామాట : యడ్యూరప్పకు కాదు బీజేపీకే అగ్ని పరీక్ష

Leave a Reply