చంద్రబాబు ఇంటిని చుట్టుముట్టిన వరదనీరు..సెటైర్లు వేసిన వైసీపీ

floods came to chandrababu house
Share Icons:

అమరావతి:

 

ఏపీ ప్రభుత్వం భయపడినట్లేగానే జరిగింది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలని తొలగించాలని లేదంటే వరద ముంచెత్తుందని జగన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ అక్రమ కట్టడల్లో చంద్రబాబు నివసించే ఇల్లు కూడా ఉంది. దీని చుట్టూ కూడా వరదనీరు చుట్టుముట్టింది. దీంతో సిబ్బంది ఇసుక బస్తాలు వేసి వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తుండటంతో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని అన్నారు. దీంతో అక్కడి సిబ్బంది లారీలతో ఇసుక బస్తాలను తరలిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్ ను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు.

 

లింగమనేని గెస్ట్ హౌస్ మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కాబట్టే చంద్రబాబుకు ఇక్కడి పరిస్థితి అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయక తప్పదని ఆర్కే స్పష్టం చేశారు.

 

ఇక నది ఒడ్డునే ఉన్న చంద్రబాబు ఇంట్లోకి నీరు చేరి, ఇసుక మేటలు కనిపిస్తున్నాయని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. ఇంటిని ఖాళీ చేయాలని తాము చెబితే, రాజకీయ కోణంలో చూసి విమర్శించిన ఆయనకు, ఇప్పుడు వరద వస్తే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో అర్ధమైందని అన్నారు. తాము మంచికి చెప్పినా బాబు వినిపించుకోలేదని ఎద్దేవా చేశారు

 

Leave a Reply