వర్షాలకు 1074 మంది మృతి

Share Icons:
కొత్త ఢిల్లీ,  ఆగష్టు 27 ,
ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 1074 మంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించింది. కేరళనే కాదు మరికొన్ని రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. మొత్తం 1074 మరణాల్లో 443 ఒక్క కేరళలోనే కావడం గమనార్హం. మరో 166 మంది కర్ణాటకలో మృత్యువాతపడ్డారు. ఉత్తరప్రదేశ్ (218), పశ్చిమ బెంగాల్ (198), అస్సాం (49)లలోనూ మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు హోంశాఖ నివేదిక స్పష్టంచేసింది. వరదల కారణంగా ఇండ్లు దెబ్బతినడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,14,863 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నట్లు కూడా ఈ నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా కేరళ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. రెండు, మూడు వారాలుగా రాష్ట్రం మొత్తం నీటిలో మునిగిపోయింది. లక్షల మంది పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అన్ని రాష్ర్టాల్లో సేవలందిస్తున్నది. ఇండియన్ ఆర్మీ కూడా కేరళను పునర్నిర్మించే ప్రక్రియలో పాలుపంచు
కుంటున్నది.
మామాట: పాలకులు వేల కోట్లతో విగ్రహాలు పెడుతున్నారుగా.. అవి రక్షిస్తాయి

Leave a Reply