ఫ్లిప్‌కార్ట్‌ బొనాంజా సేల్‌: భారీగా ఆఫర్లు…

Walmart's big Flipkart deal
Share Icons:

ముంబై: దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు మొబైల్స్‌ బొనాంజా సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎ50, హానర్‌ 9ఎక్స్‌, ఐఫోన్‌ XS, రియల్‌మి ఎక్స్‌టీ, గూగుల్‌ పిక్సల్‌ 3ఎ, ఒప్పో కె1. అసుస్‌ మ్యాక్స్‌ ఎం1, వివో జడ్‌1 ప్రొ, ఒప్పో రెనో 10ఎక్స్‌ జూమ్‌, రియల్‌మి ఎక్స్‌2 ప్రొ, గెలాక్సీ ఎస్‌10 లైట్‌, ఎంఐ ఎ3 తదితర ఫోన్లపై తగ్గింపు ధరలను అందివ్వనున్నారు. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులతో ఈ ఫోన్లపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు.

గెలాక్సీ ఎ20 ఎస్‌ ధర తగ్గింపు..

ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు శాంసంగ్‌ తన గెలాక్సీ ఎ20 ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.13,999 ఉండగా ప్రస్తుతం దీన్ని రూ.1వేయి వరకు తగ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.12,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఇదే ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌ వేరియెంట్‌ ధర అలాగే ఉంది. అందులో ఎలాంటి మార్పూ లేదు.

రూ.10,999 ధరకు ఈ వేరియెంట్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎ20 ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌, 13, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

శాంసంగ్‌ కొత్త ఫోన్ల ధరలు

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ సిరీస్‌లో ఇటీవలే గెలాక్సీ ఎస్‌20, ఎస్‌20 ప్లస్‌, ఎస్‌20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా భారత్‌లో ఈ ఫోన్ల ధరలను శాంసంగ్‌ ప్రకటించింది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 4జీ – 8జీబీ + 128జీబీ – ధర రూ.66,999

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ప్లస్‌ 4జీ – 8జీబీ + 128జీబీ – ధర రూ.73,999

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా 5జీ – 12జీబీ + 128జీబీ – ధర రూ.92,999

ఈ ఫోన్లను శాంసంగ్‌ భారత్‌లో మార్చి 6వ తేదీ నుంచి విక్రయించనుంది. ఈ సందర్భంగా పలు లాంచింగ్‌ ఆఫర్లను కూడా అందిస్తున్నారు.

 

Leave a Reply