ఫ్లిప్‌కార్ట్ ‘మొబైల్స్ బొనాంజా సేల్‌’

ఫ్లిప్‌కార్ట్ ‘మొబైల్స్ బొనాంజా సేల్‌’
Views:
18

ముంబయి, 13 మార్చి:

ప్రముఖ దిగ్గజ సంస్థలకు చెందిన స్మార్ట్‌ఫోన్స్‌ని తగ్గింపు ధరతో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘మొబైల్స్ బొనాంజా సేల్‌’ పేరుతో వినియోగదారులకు అందిస్తుంది. ఈ సేల్ నేటి నుండి ప్రారంభమై ఈ నెల 15వ తేదీ గురువారం వరకు కొనసాగుతుంది. ఇక ఇందులో ఆకర్షణీయమైన డిస్కౌంట్లకే స్మార్ట్‌ఫోన్లు లభ్యం కానున్నాయి.

 ఆఫర్లు ఉన్న ఫోన్లు….

  • ఒప్పో ఎఫ్3 (4జీబీ) – రూ.11,990 (రూ.5వేలు తగ్గింపు)
  • మోటో ఈ4 ప్లస్ (3జీబీ) – రూ.8,999
  • శాంసంగ్ గెలాక్సీ ఎస్7 (4జీబీ) – రూ.22,990
  • లెనోవో కె8 ప్లస్ (3 జీబీ, 32 జీబీ) – రూ.7,999 (రూ.2వేలు తగ్గింపు)
  • గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ – రూ.49,999
  • శాంసంగ్ గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ (16 జీబీ) – రూ.9,499
  • శాంసంగ్ గెలాక్సీ ఆన్5 – రూ.6,290
  • ఎల్‌జీ కే7ఐ – రూ.4,999
  • ఐవూమీ ఐ1 – రూ.5,999
  • మోటో జడ్2 ప్లే (4జీబీ) – రూ.19,999

ఇక ఈ స్మార్ట్‌ఫోన్లు మాత్రమే కాకుండా హానర్ 9 లైట్, షియోమీ రెడ్‌మీ నోట్ 5/నోట్ 5 ప్రొ, రెడ్‌మీ 5ఎ, ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3 ఫోన్లపై కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. వీటితోపాటు ఆయా ఫోన్లకు నో కాస్ట్ ఈఎంఐ, బై బ్యాక్ గ్యారంటీ, ఎక్స్‌ఛేంజ్ వంటి ఆఫర్లను అందిస్తున్నారు. అలాగే ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 5% డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నారు.

మామాట: కొత్తగా ఫోన్లు కొనుగోలు చేసే వారికి మంచి అవకాశం…..

English summary:

Flipkart’s Mobile Bonanza sale 2018 has kicked off on Tuesday and the three-day sale will see massive discounts as well as offers on several phones. Flipkart’s Mobiles Bonanza sale from March 13 to March 15 has discounts on smartphones from Lenovo, Oppo, Pixel, Samsung, Moto, Honor, Vivo, Xiaomi and others in different price brackets.

(Visited 17 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: