ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ల్యాప్‌టాప్….ధర ఎంతటే?

Flipkart Launches Falkon Aerbook Thin-and-Light Laptop Under MarQ Label, Price Starts at Rs. 39,990
Share Icons:

ముంబై: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. ఫాల్కన్‌ ఏర్‌బుక్‌ పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.39,990 ధరకు ఈ ల్యాప్‌టాప్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. మార్‌క్యూ బై ఫ్లిప్‌కార్ట్‌ బ్రాండ్‌ కింద ఈ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్‌ విడుదల చేసింది. ఇందులో 13.3 ఇంచ్‌ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్‌ కేవలం 1.26 కిలోల బరువును మాత్రమే కలిగి చాలా స్లిమ్‌ డిజైన్‌తో లైట్‌గా ఉంటుంది. ఇందులో ఇంటెల్‌ 8వ జనరేషన్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, 37 వాట్‌ అవర్‌ బ్యాటరీ, 5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ తదితర ఇతర ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నారు. దీనికి ఏడాదిపాటు డోర్‌ స్టెప్‌ వారంటీని అందిస్తున్నారు.

ఒప్పో ఎఫ్15

ప్రముఖ  చైనా మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎఫ్‌15ను జనవరి 16వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో.. 6.4 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి70 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 48, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 16 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, 4025 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

గెలాక్సీ ఎస్‌10 లైట్‌

శాంసంగ్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ను భారత్‌లో ఈ నెల 23వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ధర రూ.35వేల వరకు ఉంటుందని తెలిసింది. ఇందులో.. 6.7 ఇంచుల డిస్‌ప్లే, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 32 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌, బ్లూటూత్‌ ఎస్‌ పెన్‌, స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 48 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా.. తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు.

Leave a Reply