ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్…

Share Icons:

ముంబై, 29 అక్టోబర్:

పండుగల సీజన్‌లో భారీ ఆఫర్లు ప్రకటించి వినియోగదారులని  ఆకట్టుకుంటున్న ప్రముఖ ఈ కామర్స్ సంస్త ఫ్లిప్‌కార్ట్ మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. నవంబర్ 1వ తేదీ నుంచి దీపావళి సేల్‌ను నిర్వహిస్తున్నది. నవంబర్ 5వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది.

ఇందులో రియల్ మి 2 ప్రొ, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, హానర్ 9ఎన్, లెనోవో ఎ5, లెనోవో కె9 ఫోన్లను తగ్గింపు ధరలకు విక్రయించనున్నారు. ఇక సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు.

అలాగే డెబిట్ కార్డు ఈఎంఐలు, క్యాష్‌బ్యాక్‌లు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాలను కూడా ఈ సేల్‌లో అందివ్వనున్నారు.

అలాగే అనేక రకాల ప్రొడక్ట్స్‌పై బై బ్యాక్ గ్యారంటీ, కంప్లీట్ ప్రొటెక్షన్ ప్లాన్‌లను అందివ్వనున్నారు. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్లు, రాయితీలను ఫ్లిప్‌కార్ట్ తన దీపావళి సేల్‌లో అందివ్వనుంది.

మామాట: ఇంకేం వినియోగదారులు ఈ బంపర్ ఆఫర్‌ని వినియోగించుకోండి….

Leave a Reply