ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్…అతి తక్కువ ధరకే డెక్ట్రాన్ హెచ్‌డి ఎల్‌ఈ‌డి టీవీ

Walmart's big Flipkart deal
Share Icons:

ఢిల్లీ, 17 మే:

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది.  24 అంగుళాల డెక్ట్రాన్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.5,499కే అందిస్తోంది.

అయితే దీని అసలు ధర రూ.11,999. ఇక ఈ టీవీపై భారీ రాయితీతోపాటు మరిన్ని ఆఫర్లు కూడా ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. అదే యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకైతే ఐదు శాతం లభిస్తుంది.

దీంతో పాటు  నెలకు రూ.183తో ఈఎంఐ పద్ధతిలోనూ దీన్ని అందిస్తుంది.  డెక్ట్రాన్ 24 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలో 16 వాట్ స్పీకర్ ఔట్‌పుట్, హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే, హెచ్‌డీఎంఐ పోర్ట్, యూఎస్‌బీ పోర్ట్, ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ వంటి ప్రత్యేకతలున్నాయి.

మామాట: వినియోగదారులని ఆకర్షించే ఆఫర్…

Leave a Reply