అదిరిపోయే డిస్కౌంట్లు…ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్..

Share Icons:

ముంబై, 11 మే:

ప్రముఖ ఈ-కామ‌ర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్…అదిరిపోయే డిస్కౌంట్లతో మరో సేల్‌ని తీసుకొచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఈ సేల్ ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ఎల‌క్ట్రానిక్స్‌, ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర ఉత్ప‌త్తుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌తోపాటు ప‌లు ఉత్ప‌త్తుల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను కూడా అందివ్వ‌నున్నారు.

అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేస్తే అద‌నంగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఇక ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్లు, నోకియా ఫోన్లు, రియ‌ల్ మి, హాన‌ర్ త‌దిత‌ర ఫోన్ల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. అలాగే ఇంకా చాలా వస్తువులపై ఈ సేల్‌లో ఆఫర్లు ఇచ్చింది.

మామాట: వినియోగదారులని ఆకర్షించడానికేగా

Leave a Reply