అదిరిపోయే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్..

Share Icons:

ముంబై, 3 డిసెంబర్:

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు మరో సారి అదిరిపోయే ఆఫర్లు ఇవ్వనుంది. బిగ్ షాపింగ్ డేస్ పేరుతో ఈ నెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్.. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది.

అలాగే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మొబైల్ బై బ్యాక్ గ్యారెంటీతోపాటు రూ. 99కే కంప్లీట్ డ్యామేజీ ప్రొటెక్షన్ అందిస్తోంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్లూ ఉన్నాయి. రియల్‌మీ సి1, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ 1, ఆనర్ 9 ఎన్, పొకో ఎఫ్ 1, గూగుల్ పిక్సెల్ 2, రెడ్‌మీ నోట్ 6 ప్రొ, నోకియా 5.1, వంటి స్మార్ట్‌ఫోన్లపై కనీవినీ ఆఫర్లు ప్రకటించింది. అలాగే టీవీలు, గృహోపకరణాలపై 70 శాతం, ఫ్యాషన్, హోం ఫర్నిచర్‌పై 40 నుంచి 80 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇక ఇవి కాకుండా ల్యాప్‌టాప్‌లు, కెమెరా, ఆడియో యాక్సెసరీలు ఇతర వాటిపై కూడా మంచి ఆఫర్లని ఇవ్వనుంది.

మామాట: ఇకేం కొత్త ఫోన్లు కొనుగోలు చేద్దామనుకునే వారు ఈ ఆఫర్‌ని ఉపయోగించుకోండి…

Leave a Reply