ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్: ఆఫర్లే ఆఫర్లు…

Share Icons:

ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్ ప్రకటించింది. మార్చి 19 నుంచి మార్చి 22 వరకు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు మార్చి 18 రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఎప్పట్లాగే డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ నాలుగు రోజుల సేల్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌, టీవీలు, అప్లయెన్సెస్‌, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌, హోమ్ అండ్ ఫర్నీచర్‌పై ఆఫర్లు ఉన్నాయి.

ఈ సేల్‌కు సంబంధించి మార్చి 15 నుంచి 17 వరకు ప్రీ బుక్ సేల్ కూడా ప్రారంభించింది. అంటే కొన్ని ప్రొడక్ట్స్‌ను మార్చి 17 వరకు బుక్ చేసుకొని కొంత డబ్బులు చెల్లించాలి. సేల్ సమయంలో మిగతా పేమెంట్ చేసి ఆర్డర్ పూర్తి చేయాలి. ప్రీ బుక్ సేల్‌లో కొనేవారికి ప్రొడక్ట్స్ కొంత తక్కువ ధరకే లభిస్తాయి. ఎప్పట్లాగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. ఫ్యాషన్‌పై 50% నుంచి 80% వరకు, హోమ్ ఎసెన్షియల్, ఫర్నీచర్‌పై 80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్లపై 80% వరకు తగ్గింపు పొందొచ్చు.

ఢమాల్ డీల్స్ పేరుతో మొబైల్స్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై ఎక్స్‌ట్రా డిస్కౌంట్, ప్రైస్ క్రాష్ డీల్‌లో దుస్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై 15% తగ్గింపు పొందొచ్చు. వీటితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

 

Leave a Reply