మళ్ళీ బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చేసిన ఫ్లిప్ కార్ట్….

Flipkart Big Diwali Sale 2019 to Return on October 21
Share Icons:

ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరోసారి అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చేసింది. ఇప్పటికే ఒకసారి బిగ్ దివాళి సేల్ నిర్వహించిన ఈ ఈకామర్స్ సంస్థ.. మరోసారి అదే ఆఫర్లతో బిగ్ దివాళి సేల్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ సేల్’లో ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.

టీవీలు, అప్లయెన్సెస్‌ విభాగంలో 50,000 పైగా ప్రొడక్ట్స్‌పై 75% వరకు డిస్కౌంట్స్ అందించనుంది. ఎలక్ట్రానిక్స్‌పై 90 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. 3 కోట్లకు పైగా ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్స్ ఎక్స్‌ఛేంజ్ లాంటి సదుపాయాలుంటాయి. ఫ్యాషన్ ప్రొడక్ట్స్ పైనా 50-80% వరకు, ఫర్నీచర్‌పై 40-80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 90% వరకు తగ్గింపు అందించనుంది. ఇక పలు స్మార్ట్ ఫోన్లు తగ్గింపు ధరలుగా లభించనుండగా, కొన్ని ఫోన్లకు అన్ని బ్యాంక్ కార్డ్స్ మీద 10 శాతం తగ్గింపు ఇస్తున్నారు.

అదేవిధంగా ఎస్‌బి‌ఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ మీద కూడా 10 శాతం తగ్గింపు ఆఫర్ ఇస్తున్నారు. బిగ్ దివాళి సేల్ పేరుతో 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజులపాటు సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల నిర్వహించిన సేల్‌ను మిస్ అయిన వారికి ఇది మరో అద్భుత అవకాశం. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రైబర్లకు ఆదివారం రాత్రి 8 గంటల నుంచే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.

అమ్మకాల్లో దూసుకుపోతున్న వన్‌ప్లస్ 7టి ప్రొ

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఇటీవలే ఇండియాలో వన్‌ప్లస్ 7టి ప్రొని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫోన్ విడుదలైన దగ్గర నుంచి సేల్స్ బాగా జరుగుతున్నాయి. ఈ ఫోన్ రూ.53,999 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. దీని కొనుగోలుపై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.3వేలు, ఐసీఐసీఐ కార్డులతో రూ.1750 వరకు ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు

వన్‌ప్లస్ 7టి ప్రొ ఫీచర్లు…

6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10, డ్యుయల్ సిమ్, 48, 8, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, 4080 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Leave a Reply