మరోసారి బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చేసిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌

Flipkart Big Diwali Sale 2019 announced
Share Icons:

ముంబై: ఇటీవలే దసరా సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు ఇచ్చిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మరోసారి బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చేశాయి. ఫ్లిప్‌కార్ట్ దీపావళికి ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్ జరగనుంది. అందులో భాగంగా ఫోన్లు, టీవీలతోపాటు వియరబుల్స్, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు తదితర ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌లో షియోమీ, వివో, రియల్‌మి కంపెనీలకు చెందిన ఫోన్లతోపాటు టీవీలపై ఆకట్టుకునే ఆఫర్లను అందివ్వన్నునారు. అలాగే ఎస్‌బీఐ కార్డులతో ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు పలు ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు.

అటు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ నుంచి మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగ్గా, 13 నుంచి 17వ తేదీ వరకు మరో దఫా ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. అయితే ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ పేరిట ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అనేక ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందివ్వనున్నారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్‌లో ఐసీఐసీఐ కార్డులతో ఐటమ్స్‌ను కొన్నవారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ విధానంలో ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. దీంతోపాటు వన్‌ప్లస్, షియోమీ, ఆపిల్, శాంసంగ్ కంపెనీలకు చెందిన పలు ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు అందివ్వనున్నారు. అలాగే అమెజాన్ తన ఎకో డివైస్‌లను కూడా తగ్గింపు ధరలకే అందివ్వనుంది.

 

Leave a Reply