సూపర్ ఆఫర్స్: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి డేస్‌ సేల్‌

Share Icons:

ముంబై: దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన సైట్‌లో రియల్‌మి డేస్‌ సేల్‌ను నిర్వహిస్తున్నది. తాజాగా ప్రారంభమైన ఈ సేల్‌ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఐసీఐసీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో ఫోన్లను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే రియల్‌మి 5 ప్రొ రూ.3వేల తగ్గింపు ధరకు ఈ సేల్‌లో లభిస్తున్నది. రియల్‌మి సి2 రూ.2వేల తగ్గింపు ధరకు, రియల్‌మి 3 ప్రొ రూ.6వేల తగ్గింపు ధరకు, రియల్‌మి ఎక్స్‌, ఎక్స్‌టీలు రూ.3వేలు, రూ.1వేయి తగ్గింపు ధరలకు ఈ సేల్‌లో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక రియల్‌మి ఎక్స్‌2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ రూపంలో కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు అదనపు డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు.

రూ.28వేలకే కొత్త ఐఫోన్…

సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్‌ తన నూతన ఐఫోన్‌ను మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ ఫోన్‌ను ఐఫోన్‌ ఎస్‌ఈ2 లేదా ఐఫోన్‌ 9 పేరిట ఆపిల్‌ విడుదల చేస్తుందని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయం అటుంచితే.. సదరు కొత్త ఐఫోన్‌ను ఆపిల్‌ కేవలం రూ.28వేలకే భారత వినియోగదారులకు అందిస్తుందని తెలిసింది. సదరు ఐఫోన్‌ ధర యూఎస్‌లో 399 డాలర్లుగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఐఫోన్‌ 6, 7, 8 సిరీస్‌ ఫోన్లు, ఐఫోన్‌ ఎస్‌ఈ ఫోన్‌ను వాడేవారు ఆ కొత్త ఐఫోన్‌కు సులభంగా అప్‌గ్రేడ్‌ అవుతారని, ధర తక్కువ ఉంటుంది కనుక ఆ ఫోన్‌ను చాలా మంది కొనుగోలు చేస్తారని కూడా తెలుస్తోంది.

వొడాఫోన్‌ రూ.499 ప్లాన్

టెలికాం సంస్థ వొడాఫోన్‌ రూ.499 కి ఓ నూతన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ వస్తాయి. అలాగే జీ5 యాప్‌కు వినియోగదారులకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. ఇక సర్కిల్‌ను బట్టి ఈ ప్లాన్‌ వాలిడిటీని 60 నుంచి 70 రోజుల వరకు నిర్ణయించారు. అలాగే రూ.555 ప్రీపెయిడ్‌ ప్లాన్‌కు వొడాఫోన్‌ పలు మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌కు 70 రోజుల వాలిడిటీని నిర్ణయించగా, ఇకపై 77 రోజుల వాలిడిటీ కస్టమర్లకు లభ్యం కానుంది.

 

Leave a Reply