హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు

Share Icons:
హైద్రాబాద్, సెప్టెంబర్ 6,
హైదరాబాద్ నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఆర్‌టిసిని నష్టాలను గట్టిక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నష్టాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 40 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం ఐదు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ఈ బస్సులు ప్రయాణిస్తాయి. ఒక కిలోమీటర్‌కు ఓ యూనిట్ చొప్పున కరెంట్ ఖర్చు అవుతుంది. ఈ బస్సులతో పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగం ఉంటుంది.వాణిజ్య వాహనాల తయారీ సంస్థ గోల్డ్‌స్టోన్ బివైడి విపణిలోకి సరికొత్త ఇబజ్ కె6 బస్సును లాంచ్ చేసింది. పట్టణ ప్రజా రవాణా కోసం అభివృద్ది చేసిన ఈ ఇబజ్ కె6 ఎలక్ట్రిక్ బస్సు ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 200కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్ చైనాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ బివైడి భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లోకి అర్బన్ ఎలక్ట్రిక్ బస్సును లాంచ్ చేసింది. ఇబజ్ కె6 పేరుతో విడుదల చేసిన దీని పొడవు 7-మీటర్లుగా ఉంది మరియు దీని గరిష్ట పరిధి 200కిలోమీటర్లు. ప్రపంచ వ్యాప్తంగా లిథియం-అయాన్ పాస్పేట్ బ్యాటరీలను తయారు చేస్తున్న కంపెనీలలో చైనాకు చెందిన బివైడ్ సంస్థ ఒకటి. లిథియం-అయాన్ పాస్పేట్ బ్యాటరీల అనుసంధానం గల ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 241బిహెచ్‌పి పవర్ మరియు 1500ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇండియాలో వాణిజ్య వాహనాల మీద ఉన్న నిభందనలకు అనుగుణంగా దీని గరిష్ట వేగాన్ని గంటకు 80కిలోమీటర్లుగా నిర్ధేశించారు.
అంతే కాకుండా ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ కలదు, ఇది బ్రేకులు అప్లే చేసినపుడు విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది. మరియు మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సేఫ్టీ కోసం గోల్డ్‌స్టోన్ తమ ఇబజ్ కె6 ఎలక్ట్రిక్ బస్సులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందించింది. ఛార్జింగ్ పూర్తిగా అయిపోయిన బ్యాటరీలను ఏసి క్విక్ ఛార్జర్ ద్వారా కేవలం 4 గంటల్లోనే బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
మామాట : పర్యావరణానికి మేలు చేస్తాయా…. ఐతే ఓకే

Leave a Reply