ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. తొమ్మిదో అంతస్తులో మంటలు…

Share Icons:
  • గత రాత్రి పదిన్నర గంటల సమయంలో ప్రమాదం
  • ప్రమాదం జరిగిన అంతస్తులో పలు లేబొరేటరీలు,
  • మంటలను అదుపు చేసిన 26 ఫైర్ ఇంజన్లు

దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో గత రాత్రి 10.32 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పలు లేబొరేటరీలు, అత్యంత అధునాతన పరీక్ష కేంద్రాలు ఉన్న 9వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. కాగా, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక శకటాలు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి.

ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన అంతస్తును కొవిడ్ పరీక్షలు చేయడానికి ఉపయోగిస్తారని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply