అంబలితో ఆరోగ్యం..!

Share Icons:

తిరుపతి, ఏప్రిల్ 13,

వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వాతావరణంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా మన శీరీరం నుంచీ అధికశాతం నీరు చెమట రూపంలో వెళుతుంటుంది. వేసవిలో ఇదే పెద్ద సవాలు. మనం నిరంతరం శరీరానికి కావలసిన ద్రవపదార్ధాలను అందిస్తూఉండాలి. అందుకే మన పెద్దలు వేసవిలో అంబలి తీసుకునే విధంగా జాతర పేరుతో పండగలు పెట్టారు.  జొన్నపిండి, రాగిపిండితో తయారు చేసే అంబలి, జావ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఉదయాన్నే, పెరుగు, ఉల్లిపాయలు తరిగివేసిన అంబలి ఓ గ్లాస్ తీసుకున్నామా.. బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకోనక్కర్లేదు. ఇప్పుడు తక్కువగా చేస్తున్నారు కానీ.. పూర్వకాలంలో ఇదే వారికి టిఫిన్.. ఎండల్లో బయటికి వెళ్లినప్పుడు.. వెళ్లేముందు ఈ అంబలిని తీసుకోవడం వల్ల వడదెబ్బ వంటి సమస్యలు దరిచేరవు. అంతటి అద్భుతంగా పనిచేస్తుంది. జొన్న అంబలి చేయాలంటే.. పిండిని ముందురోజున కలియబెట్టాలి.. కాస్తా రవ్వలా ఉంటే మరింత టేస్టీగా ఉంటుంది. రాగిజావ అయితే అప్పటికప్పుడే చేసుకోవచ్చు.. వీటిని తీసుకోవడం వల్ల ఎండల నుంచి ఉపశమనమే కాదు.. మరిన్నీ అద్భుత ప్రయోజనాలుకలుగుతాయి..

* అంబలి ఆకలిని తీరుస్తుంది.. శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది.

* రెగ్యులర్‌గా తాగడం వల్ల అలసట తీరుతుంది.

* షుగర్, బీపీ ఉన్నవారికి అంబలి ఆరోగ్య ప్రదాయిని అని చెప్పొచ్చు.

* బియ్యంపిండితో చేసిన అంబలి తాగితే కెలోరీలు పెరుగుతాయి.

* రాగి అంబలి తాగడం వల్ల వీర్యపుష్టి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

* ప్రతీరోజూ అంబలి తాగడం వల్ల శరీర దృఢత్వం పెరుగుతుంది.

* స్థూలకాయంతో బాధపడేవారు… అంబలి తాగడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది.

* శరీరంలో ఎక్కువగా వేడి ఉంటే ఈ అంబలి తాగడం వల్ల సమస్య తగ్గుతుంది.

మామాట: అందుకే.. పెద్దల మాట చద్దిమూట అన్నారా..

Leave a Reply