సినీ గీత రచయిత చంద్రబోస్‌ తల్లి మృతి

Share Icons:

హైదరాబాద్‌, మే20,

ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ తల్లి మదనమ్మ కన్నుమూశారు. అయితే ఆమెకు ఈరోజు గుండేపోటు రావండతో తుదిశ్వాస విడిచారు. చంద్రబోస్‌ది వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగిరి. ఆయన తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు. తల్లి మదనమ్మ గృహణి. నలుగురు సంతానంలో చంద్రబోస్‌ చివరివారు.

ఈరోజు సాయంత్రం చల్లగిరిలో మదనమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే చంద్రబోస్‌ చిన్నప్పుడు తల్లితో కలిసి ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూసేవాడనని, వాటి వల్లే పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నానని చంద్రబోస్‌ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Leave a Reply